నారద వర్తమాన సమాచారం
పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవికి సీఎం చంద్రబాబు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్వయంకృషితో సినీరంగంలో ఎన్నో విజయాలను అందుకుని, ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన ఆయన వెండితెర ఆణిముత్యమని కొనియాడారు. తరాలు మారినా చెక్కుచెదరని ప్రేక్షకాభిమానం ఆయన సొంతమని పేర్కొన్నారు. ఆయన స్థాపించిన ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్లు తనలోని మానవత్వానికి నిదర్శనమని కొనియాడారు. చిరంజీవి మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని అన్నారు. పేరు సార్ధకం చేసుకునేలా ఆయన చిరంజీవిగా ఉండాలని, ఆయనకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు అన్నారు*
Discover more from
Subscribe to get the latest posts sent to your email.