నారద వర్తమాన సమాచారం
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ని కలిసి ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలులోకి తీసుకురావాలని కోరిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ మరియు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజనర్సింహ అలాగే మాదిగ ప్రజా ప్రతినిధుల బృందం..
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణను అమల్లోకి తీసుకురావాలని కోరుతూ ఉపముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క ని కోరడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని ఆ నిర్ణయానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కట్టుబడి ముందుకు సాగుతుందని భట్టి విక్రమార్క తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కారం చేసుకొని ఉమ్మడి దళిత గిరిజన ప్రజల సమస్యల పరిష్కారం కోసం ముందుకు నడుద్దామని మంద కృష్ణ మాదిగ భట్టి విక్రమార్క కి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి వర్యులు మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కాలే యాదయ్య,మందుల సామేల్, డా. కవ్వంపల్లి సత్యనారాయణ , తోట లక్ష్మీకాంతరావు , ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ, ఓయు ప్రొఫెసర్ గడ్డం మల్లేశం ,కాంగ్రెస్ మాదిగ నేతలు కొండేటి మల్లన్న,విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.