నారద వర్తమాన సమాచారం
ప్రజలకు ఇబ్బందుల్లేని ప్రయాణాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ప్రత్తిపాటి
చిలకలూరిపేట డిపోలో నూతన బస్సులను ప్రారంభించిన ప్రత్తిపాటి
అయిదేళ్లుగా డొక్కు బస్సులు, వరస ప్రమాదాలు, వేళాపాళా లేని సర్వీసులతో పూర్తిగా గాడి తప్పిన ఆర్టీసీ తిరిగి ఇబ్బందుల్లేని ప్రయాణాలతో ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా తమ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. అందుకోసమే వందలాది కొత్త బస్సులు కూడా కొనుగోలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతి ఇచ్చారని, భవిష్యత్‌లో మరిన్ని వాహనాలు కూడా వాటికి జత చేర్చుతామని తెలిపారు. చిలకలూరిపేట ఆర్టీసీ డిపో నుంచి రెండు నూతన బస్సు సర్వీసులను గురువారం ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ప్రజల సౌకర్యార్థం చిలకలూరిపేట నుంచి విజయవాడ, చిలకలూరిపేట నుంచి హైదరాబాద్(ఈసీఐఎల్)కు బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. చిలకలూరిపేట బస్టాండ్ ఆవరణలో జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. అనంతరం బస్సులో కొంతదూరం ప్రయాణించి ప్రయాణికులతో మాట కలిపా రు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి అయిదేళ్లు పాలించి ఆర్టీసీకి ఒక్క కొత్త బస్సు కూడా కొనకుండా ఆ సంస్థను జగన్ రెడ్డి సర్వనాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో ప్రజలకు అవసరమైన రద్దీ మార్గాల్లో కూడా బస్సు సర్వీసులు రద్దు చేసి, తగ్గించి అవస్థలకు గురి చేశారన్నారు. ఆ లోటుపాట్లను సరిచేస్తూ ప్రజలకు, మరీ ముఖ్యం గా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు కొత్త సర్వీసులు కూడా ప్రవేశ పెడు తున్నామన్నారు. భవిష్యత్‌లో అవసరాల మేరకు మరికొన్ని కొత్త సర్వీసులను కూడా తీసుకుని వస్తామని తెలిపారు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.