నారద వర్తమాన సమాచారం
రావణుడు చనిపోయే ముందు రాముడికి చెప్పిన మాట..
లంకాధిపతి రావణబ్రహ్మ యుద్ధ భూమిలో.. మృత్యు శయ్యపై అవసాన దశలో శ్రీరాముడితో ఇలా అన్నాడు.
‘రామా! నీ కంటే నేను అన్నింటిలో గొప్పవాణ్ణి. నాది బ్రాహ్మణ జాతి, నీది క్షత్రియ జాతి. నేను నీ కంటే వయసులో పెద్దవాణ్ణి. నా కుటుంబం నీ కుటుంబం కన్నా పెద్దది. నా వైభవం నీ వైభవం కన్నా అధికం. మీ అంతఃపురమే స్వర్ణం.. నా లంకానగరమే స్వర్ణమయం. నేను బలపరాక్రమాలలో.. నీకంటే శ్రేష్ఠుడిని. నా రాజ్యం.. నీ రాజ్యం కంటే పెద్దది. ఇన్ని శ్రేష్టమైన విజయాలు కలిగి ఉన్నా.. యుద్ధంలో నీ ముందు ఓడిపోయాను. దీనికి కారణం ఒక్కటే.. నీ తమ్ముడు నీ దగ్గర ఉన్నాడు. నా తమ్ముడు నన్ను వదిలి వెళ్లిపోయాడు’.
కుటుంబ పరివారం వెంట ఉంటే ఎంతటి కష్టమైన యుద్ధమైనా విజయం సాధిస్తుంది. పరివారమే కుటుంబం అయితే ఆనందం మన వెంటే ఉంటుంది. కుటుంబం దూరమైతే బతుకే భారమవుతుంది. రావణబ్రహ్మ లాంటి వాడే ఓటమి పాలయ్యాడంటే.. మనలాంటి వాళ్ల బతుకెంత?
*అందుకే అందరం కలిసి ఉందాం.. విజయాలు సాధిద్దాం! కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా ప్రయత్నిద్దాం!!*
Discover more from
Subscribe to get the latest posts sent to your email.