నారద వర్తమాన సమాచారం
వినాయక చవితి మండపాల నిర్వహణ నియమాలు
1. సెప్టెంబర్ నెల 7వ తేదీన రాబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా పందిరి/ మండపాలు ఏర్పాటు చేసుకోదలచిన వారు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.
2. నిర్వహకులు ఈ క్రింద తెలిపిన నిబంధనలను తప్పనిసరిగ పాటించాలి.
3. వినాయక విగ్రహ ప్రతిష్ఠ పందిళ్ళు/మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి 5 లేదా అంతకంటే ఎక్కువ మంది కమిటీగా ఏర్పడి వారి వివరాలు సంబంధిత పోలీస్ స్టేషన్ లలో తెలిపి, వారి గుర్తింపుకార్డునకలు కాపీలు జత చేయాలి.
4. ప్రైవేట్ లేదా పంచాయతీ/మున్సిపాలిటీ కి సంబంధించిన స్థలాలలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయదలచిన
వారు ముందుగా సదరు ప్రైవేటు స్థలమైతే స్థల యజమాని అనుమతి, ప్రభుత్వ స్థలమైతే పంచాయతీ లేదా మున్సిపాలిటీ వారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.
5. ఫైర్, విద్యుత్ శాఖల అనుమతి తీసుకొని వారు సూచించిన నియమ నిబంధనలకు అనుగుణంగా వినాయక చవితి పందిళ్ళు/మండపాలు వద్ద ఇసుక మరియు నీళ్ళను ఏర్పాటు చేసుకోవాలి.
6. మండపాలలో దీపారాధనల వలన అగ్నిప్రమాదాలు జరుగకుండా జాగ్రతలు తీసుకుంటూ ఎలక్ట్రిక్ షార్ట్ సర్య్కూట్ జరుగకుండా వైరింగ్ జాగ్రత్తగా చేయించుకోవాలి.
7. విగ్రహాల ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య, నిమజ్జనం చేసే తేదీ, సమయం, నిమజ్జన మార్గం మరియు విగ్రహ నిమజ్జనానికి ఉపయోగించే వాహన వివరాలను విధిగా తెలియజేయాలి
8. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే సౌండ్ బాక్స్ లను ఉపయోగించాలి.
9. భద్రత కొరకు రాత్రి సమయాల్లో మండపాల వద్ద విధిగా ఆర్గనైజింగ్ కమిటీ వారి ప్రతినిధులు కాపలా ఉండవలెను.
10. వినాయక విగ్రహం పెట్టబోయే ప్రదేశంలో ముందుగానే CC Camera లు ఏర్పాటు చేయనిచో అనుమతులు
ఇవ్వబడవు
11. వినాయక పందిళ్ళు గాని, విగ్రహం పెట్టే ప్రదేశం గాని రోడ్డుపైన ఉండరాదు, బ్యానర్లు కాని, ప్లెక్సీలు గాని రోడ్డుపైన ప్రజల రాకపోకలకు మరియు ట్రాఫిక్ కు అంతరాయం కలిగించరాదు.
12. ఊరేగింపు సమయంలో మందుగుండు సామాగ్రిని పేల్చడం చేయరాదు.
13. పందిళ్ళ వద్ద మరియు ఊరేగింపు సమయాలలో అనుచిత ప్రదర్శనలు, అసభ్య నాట్య ప్రదర్శనలు జరుగకుండా బాధ్యతవహించాలి.
14. నిమర్జన ఊరేగింపుకు అనుమతించిన సమయం, నిమర్జన కు కేటాయించిన ప్రదేశం మరియు ఊరేగింపునకు కేటాయించిన మార్గము లాంటి నిబంధనలు ఖచ్చితంగా పాటించవలెను.
15. నిమజ్జనానికి వెళ్లే వాహనం పై మద్యం లేదా మత్తు పదార్థాలను సేవించినవారు లేదా మైనర్లు ఉండరాదు.
16. వెలుతురు వుండగానే నిమజ్జన ప్రదేశం నకు వెళ్ళాలి.
17. ఊరేగింపు సమయంలో ట్రాఫిక్ ఇబ్బంది కలుగకుండా రద్దీని నివారించేందుకు మరియు భద్రత కొరకు తగినంత మందిని అ ఏరియా ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవాలి.
18. నిమజ్జనానికి చిన్నపిల్లలను, మద్యం సేవించిన వారిని తీసుకెళ్లకండి.
19. శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా ప్రజలందరూ వినాయక చవితి పండుగను జరుపుకోవాలని నిబంధనలు పాటించేలా వినాయక విగ్రహా కమిటీ బాధ్యతా తీసుకోవాలని జిల్లా ఎస్పీశ్రీ సతీష్ కుమార్ ఐపిఎస్ సూచించారు.
స్టేషన్ హౌస్ ఆఫీసర్ పిడుగురాళ్ల
Discover more from
Subscribe to get the latest posts sent to your email.