Friday, March 14, 2025

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు నుండి రైతులకు తగు సూచనలుఇచ్చిన దాచేపల్లి మండల వ్యవసాయ అధికారి, :డి.పాప కుమారి:

నారద వర్తమాన సమాచారం
తేదీ 05

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు కారణంగా రైతులందరూ వారి పంట పొలాలలో నిలిచినటువంటి నీటిని బయటికి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని,

అదేవిధంగా నీటి ముంపుకు గురైన పంట పొలాలలో ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారి, దాచేపల్లి డి.పాప కుమారి వారు తెలియజేసి ఉన్నారు.

ప్రత్తి పంట లో తీసుకోవలసిన జాగ్రత్తలు:

1. పొలంలో నీటిని తీసివేసి అంతర కృషి చేసి పొలం ఆరేలా చూడాలి 2. మల్టీ -K (13.0.45) 10 గ్రాములు లేదా పోలిఫీడ్ (19:19:19) 10 గ్రాములు లేదా యూరియా 20 గ్రాములు+ 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. 3. 90 రోజుల లోపు వయసు వున్న పొలంలో బూస్టర్ డోస్ గా 30 కిలోల యూరియా+ 10 కిలోల పొటాష్ ఒక ఎకరాకు వేసుకోవాలి. 4. Borax 1.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. 5. గూడ, పూత రాలుతుంటే planofix 1 మి. లీ/ 4.5 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి 6. ఆకుమచ్ఛ, బ్యాక్టీరియా తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంది కనుక COC 30 గ్రాములు+ ప్లాంటమైసిన్ 1 గ్రాము 10 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి. 7.కాయకుళ్ళు వున్నచోట propiconazole 1 మి.లీ./లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading