నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయం,
నరసరావుపేట.
జిల్లాలో శాంతియుత వాతావరణం లో గణేష్ ఉత్సవాలు నిర్వహణకు అందరూ సహకరించాలి..
ప్రతి మండపం దగ్గర సీసీ కెమెరా ఏర్పాటు చేయాలి.. నిమజ్జనం జరిగే ప్రదేశంలో సీసీ కెమెరాలు, క్రేన్లు, బారికెడింగ్ ఏర్పాటు చేయాలి..
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి. శ్రీనివాసరావు, ఐపిఎస్.,
జిల్లాలో ప్రశాంత వాతావరణంలో వినాయక చతుర్థి జరుపుకునేలా వినాయక మండప కమిటీ నిర్వహణ సభ్యుల తో ప్రతి పోలీస్ స్టేషన్ అధికారి మీటింగ్ ను ఏర్పాటు చేసి మాట్లాడడం జరిగినది.
ముందుగా మండపాన్ని ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం లేకుండా ఉండే ప్రదేశాలలో మండపం ఏర్పాటు చేసుకోవాలని కమిటీ సభ్యులకు సూచించడం జరిగినది. ప్రతి మండపానికి కనీసం ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేయించడం ద్వారా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకునివ్వకుండా ఉండడం జరుగుతుంది. మండపానికి దగ్గర్లో ఇసుక మరియు నీరు ఏర్పాటు చేయడం ద్వారా ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఉపయోగపడుతుందని సూచించారు. కరెంటు పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రతి మండపాన్ని ఎలక్ట్రిక్ అధికారుల సమన్వయంతో క్షుణ్ణంగా తనిఖీ చేయించడం జరుగుతుంది. మతపరమైన సమస్యలు తలెత్తకుండా చర్చిలు లేదా మసీదులు ఉన్న ప్రాంతాలలో మండపం పెట్టుకునేందుకు పర్మిషన్ ఇవ్వడంపై ఎస్ హెచ్ ఓ తనిఖీ చేసిన తర్వాత పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది.
గొడవలు జరగడానికి ఆస్కారం ఉన్న ప్రదేశంలో మండపం ఏర్పాటు చేయడానికి పర్మిషన్ నిరాకరించడం జరిగినది. రాజకీయాలను ప్రతిబింబించే విధంగా వినాయకుడి ప్రతిమలను ఏర్పాటు చేయకూడదని కమిటీ సభ్యులతో చర్చించారు అలాంటి విగ్రహాలకు పర్మిషన్ నిరాకరించడం జరుగుతుంది. నిమజ్జనం సమయంలో లేదా ఊరేగింపు సమయం లో డీ జే లు ఎక్కువ శబ్దంతో పెట్టకూడదని కమిటీ సభ్యులను హెచ్చరించడం జరిగినది.
గతంలో వినాయక ఉత్సవాల లో అల్లర్లు సృష్టించిన వారిపై, కేసులు ఉన్న వారిపై ముందుగా బైండోవర్ చేయాలని ఎస్పీ సూచించారు. ప్రతి నిమజ్జనం చేసే ప్రదేశం వద్ద కనీసం 5 లేదా 6 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, క్రేన్లు మరియు బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఎస్పీ సూచించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.