నారద వర్తమాన సమాచారం
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కల్యాణ్ మంగళగిరిలోని తన నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారు
ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు కి ఈ రోజు లేఖ రాశారు.
విజయవాడలో విశాలమైన భవనాన్ని (ఇరిగేషన్ భవనం) క్యాంపు కార్యాలయంగా కేటాయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు తెలియచేసిన పవన్ కళ్యాణ్ .
మంగళగిరిలోని నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించుకోనున్న క్రమంలో విజయవాడలో కేటాయించిన భవనాన్ని, ఫర్నిచర్ తో సహా వెనక్కి తీసుకోవలసిందిగా ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.