నారద వర్తమాన సమాచారం
నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం జయప్రదం చేయండి
ఎంపీడీవో మహేష్ బాబు డాక్టర్ సిరి చందన ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్
ఈనెల 17వ తేదీన నిర్వహించే నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో రెండు నుండి 19 సంవత్సరముల లోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ కార్యక్రమం ను జయప్రదం చేయాలని పల్నాడు జిల్లా క్రోసూరు మండల అభివృద్ధి అధికారి మహేష్ బాబు వైద్య అధికారి సిరి చందన ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ లు శుక్రవారం కోరారు శుక్రవారం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో వారు మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు అంగన్వాడి స్కూల్ ల కు సంబంధించిన ఉపాధ్యాయులకు అంగన్వాడీ టీచర్లకు ఆల్బెండజోల్ మాత్రలు పిల్లలకు పంపిణీ నిమిత్తము అందజేశారు ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగులను నిర్మూలించుటకు వైద్య ఆరోగ్యశాఖ ఐసిడిఎస్ వైద్య శాఖలు సమిష్టిగా కృషి చేయాలని ఎంపీడీవో మహేష్ బాబు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వైద్యాధికారిని సిరి చందన మాట్లాడుతూ నులిపురుగులు ఉన్న పిల్లలు పోషకాహార లోపం రక్తహీనతతో ఎప్పుడు అలసటగా ఉంటారని శారీరిక మానసిక అభివృద్ధిలో మందకోడిగా ఉంటారని ఆమె పేర్కొన్నారు భోజన అనంతరం ఆల్బెండజోల్ మాత్రలను మింగించాలన్నారు ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్లు ఆరోగ్య కార్యకర్తలు పూర్తి చేయవలసిన ఫార్మేట్స్ గూర్చి వివరించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ కార్యాలయ ఉద్యోగి వి పున్నారావు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.