నారద వర్తమాన సమాచారం
38 ఎర్రచందనం దుంగలు స్వాధీనం : ముగ్గురు అరెస్టు
తిరుపతి మంగళంపల్లీ అటవి పరిధిలో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసి, వారి నుంచి 38 ఎర్రచందనం దుంగలు, ఒక కారు, రెండు మోటారు సైకిల్ లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాలతో, టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆర్ ఐ ( ఆపరేషన్స్)సురేష్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ ఎస్ ఐ లు లింగాధర్, విశ్వనాధ్ టీమ్ లు స్థానిక అటవీ అధికారుల సహకారంతో ఆదివారం మంగళం వైపు ఉన్న శేషాచలం అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. మంగళం లోని ఒక సూపర్ మార్కెట్ సమీపంలో కొందరు వ్యక్తులు టవేర వాహనం లో ఎర్రచందనం దుంగలు లోడ్ చేస్తుండగా పోలీసులు చుట్టుముట్టారు. కొందరు తప్పించుకోగా ముగ్గురు పట్టుబడ్డారు. వారిని తమిళనాడు చెన్నైకు చెందిన ఇద్దరు ఉండగా, మరొకరు తిరువన్నామలై జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. వారి నుంచి 38 ఎర్రచందనం దుంగలు, రెండు మోటారు సైకిళ్లు, టవేరా కారును స్వాధీనం చేసుకున్నారు. వారిని, పట్టుబడిన వాహనాలు, ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. సీఐ సురేష్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.