నారద వర్తమాన సమాచారం
ఘనంగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ జయంతి వేడుకలు
పల్నాడు జిల్లా, నరసరావుపేట…
శ్రీ విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవ జయంతి వేడుకలను కలెక్టర్ ఆఫీస్ నందు ఘనంగా నిర్వహించారు.విశిష్ట అతిథిగా బ్రహ్మంగారిమఠం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఎనిమిదవ తరం ముని మనవడు శ్రీ వెంకటాద్రి స్వాములవారు పాల్గొన్నారు. కలెక్టర్ పి.అరుణ బాబు మరియు అధికారులు కార్యక్రమంలో పాల్గొన్న విశ్వబ్రాహ్మణ సంగీయులు సృష్టికర్త మూలవిరాట్ భగవాన్ శ్రీ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నమస్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విశ్వకర్మ చేసిన అపురూపమైన కట్టడాలను కథలు, పురాణాలలో చెప్పుకుంటున్నారని వారు గొప్ప మహనీయులుగా ఎన్నో అద్భుతాలను చేయడం విన్నామని తెలిపారు. పంచముఖములతో పంచ వృత్తులు కలిగిన శ్రీ భగవాన్ విశ్వకర్మ సంబంధించిన ఎంతోమంది చేతివృత్తులు వారి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన పథకాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.అరుణ బాబు శ్రీ వెంకటాద్రి స్వాములవారికి శాలువాతో సన్మానం చేశారు.శ్రీ వెంకటాద్రి స్వామి వారు మాట్లాడుతూ శ్రీ భగవాన్ విశ్వకర్మ జయంతి వేడుకలు ప్రభుత్వ కార్యాలయంలో చేయడం ద్వారా ఎంతో మంది వృత్తుల వారికి గౌరవంగా ఉంటుందని అన్నారు. అలాగే శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కలియుగంలో ముందు జరగబోయే ఎన్నో విపత్తుల గురించి కాలజ్ఞానంలో పొందుపరిచారని లోక కళ్యాణం కోసం జన్మించెను మహానేయులు వీరబ్రహ్మేంద్రస్వామి అని అన్నారు.హిందూ ముస్లిం సమైక్యతకు,దళిత జనోద్దరణకు,కుల వివక్షతకు స్వామివారి కృషి చేశారని వివరించారు. సుతారం వాసు మాట్లాడుతూ విశ్వకర్మ లేనిదే విశ్వంబు లేదు అని ప్రతి చోట విశ్వబ్రాహ్మణులు పంచవృత్తులతో ఎప్పటి నుండో అందరికీ సహకారంగా ఉంటున్నారని అన్నారు.మనిషి పుట్టిన దగ్గర నుండి చివరి రోజుల వరకు అవసరాలకు ఉపయోగపడే వస్తువులను విశ్వబ్రాహ్మణులు అందిస్తున్నారని వివరించారు.ఈ కార్యక్రమంలో అధికారులు, పల్నాడు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘీయులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.