నారద వర్తమాన సమాచారం
పిడుగురాళ్ళ పట్టణంలో ఘనంగా విశ్వకర్మ యఙ్ఞమహోత్సవం
సెప్టెంబరు 17వతేది అనగానే విశ్వకర్మభగవానుని యఙ్ఞమహోత్సవాలు ఙ్ఞప్తికి వస్తాయి భూమి, జలం, ఆకాశం,అగ్ని ,వాయువు,బ్రహ్మ, విష్ణువు ,రుద్ర, నక్షత్రములు ఇవ్వన్ని లేని సమయాన శ్రీ విశ్వకర్మ భగవానుడు స్వయంభు రూపుడై( తనకు తానే )ఉద్బవించి పంచభూతములను దేవతలను భూలోక, స్వర్గములను సృష్టించాడు.
దేశ విదేశాలలో అన్ని రాష్ట్రాలలో పారిశ్రామిక ప్రాంగణాలలో శ్రీ విశ్వకర్మభగవానుల వారిని భక్తిశ్రద్దలతో పూజించుకుంటారు ఏందుకు అనగా విశ్వం లో సకలకర్మలను సృష్టించిన సృష్టికర్త ఆయన శ్రీ స్వామి వారి పవిత్ర ముఖారవిందము నుండి మను,మయ ,త్వష్ట, శిల్పి ,విశ్వఙ్ఞ ,అను పంఛబ్రహ్మలు ఉద్బవించి పంఛవేదాలను పారాయణం చేస్తూ పంఛవృత్తులను చేపట్టి ప్రపంచ సంక్షేమానికి , మనుగడకు ,మహోపకారం చేసారు .
కృతయుగంలో కుభేరునికి పుష్పక విమానాన్ని అందించారు. త్రేతాయుగంలో నలుడు, నీలుడు అనే మహాను భావులు విశ్వకర్మ భగవానుని చే శ్రీరామునికి వారది నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారు .
అందువల్లే రాముని పట్టాభి షేకంలో ,సీతాన్వేషణలో శ్రీరామునికి సహాయపడినవారందరిని సన్మానించి వారిని ఏదైనా వరం కోరుకోమన్నారు . అందుకు నలుడు, నీలుడు మీరు కలియుగంలో శ్రీ వేంకటేశ్వరునిగా అవతరించినపుడు ఏడుకొండలలో “నీలాద్రి కొండ” అనే ఓక కొండగా నిలచి నీ సేవా చేసే భాగ్యాన్ని కల్పించమంటాడు , అందుకు అనుగుణంగా ఏ డుకొండలలో నీలాద్రి కొండగా నిలచి శ్రీ వేంకటేశ్వరుని సన్నిదిలో నిత్యపూజలుఅందుకుంటున్నాడు,ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడికి ద్వారకాపురిని, పాండవులకు ఇంద్ర ప్రస్థానాన్ని , మరియు మయసభను నిర్మించి ఇచ్చిన మహానుభావులు విరాట్ విశ్వకర్మ భగవాన్ కలియుగంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిగా జన్మించి భూత , భవిష్యత్ ,వర్తమాన సంఘటనలను కాలఙ్ఞానం ద్వారా భక్తులందరికి జ్ఙానం అందించిన గొప్ప రాజయోగి ఇలా ఎందరో మహానుభావులు జన్మించిన సమాజానికి ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టారు అలాంటి మహాను భావులను స్మరించుకొని సకలసృష్టికి ఆది పురుషుడైన శ్రీ విశ్వకర్మ భగవానుని పూజించుకోవాలి .
పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ వీరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవాస్థానం నందు విశ్వబ్రాహ్మణ సేవా సమితి వారు . సుతారు మల్లేశ్వరరావు మరియు పలువురు విశ్వకర్మల ఆద్వర్యంలో అంగరంగ వైభవంగా విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం జరిగినది .
ఈ కార్యక్రమానికి యువనాయకులు యరపతినేని నిఖిల్ పాల్గొనటం జరిగింది.
ఆలయ అర్చకులు యరపతినేని నిఖిల్ కు పూర్ణకుభం పట్టి ఆహ్వానించడం జరిగినది .
అనంతరం శ్రీ విశ్వబ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన యజ్ఞమహోత్సవ కార్యక్రమంలో పాల్గోని పూజ నిర్వహించారు అనంతరం అన్నదానం కార్యక్రమంలో నిఖిల్ పాల్గొని భక్తులకు అన్నప్రసాదములు అందించారు.
ఈ కార్యక్రమంలో సుతారు నాగమల్లేశ్వరరావు, మల్లెం నాసరయ్య చారి, వెంకటాచారి, లక్ష్మణాచారి, సైదాచారి, ఆంజనేయ చారి, ధన్ మాస్టర్, గోపాలకృష్ణ, అమరలింగం, శివరాం ప్రసాద్, పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం, మండల విశ్వబ్రాహ్మణ సంఘం మరియు ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన రాష్ట్ర, పార్లమెంట్, నియోజకవర్గం, మండలం, వార్డు స్థాయిల్లో వివిధ హోదాల్లో వున్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత, మహిళలు పాల్గొనటం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.