నారద వర్తమాన సమాచారం
కాళేశ్వరం ప్రాజెక్టుపై కమీషన్ విచారణ మళ్ళీ షురూ
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ పినాకీ చంద్ర పీసి ఘోష్ కమీషన్ మళ్ళీ శుక్రవారం నుంచి హైదరాబాద్‌లో విచారణ జరుపనుంది. గత నెలలో విచారణ జరిపినప్పుడు సాగునీటి పారుదలశాఖ, ఈ ప్రాజెక్టులో పనిచేసిన ఉన్నతాధికారులు కలిపి మొత్తం 25మందిని ప్రశ్నించి వారు చెప్పిన వివరాలను రికార్డ్ చేసింది.
రేపటి నుంచి ప్రారంభం కాబోయే విచారణలో సాగునీటి పారుదలశాఖలో రీసర్చ్ ఇంజనీర్లు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులను కమీషన్ ప్రశ్నించనుంది. అధికారులు, ఇంజనీర్ల విచారణ పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్టుకి సంబందించి ఇతర వివరాలు అందించాలనుకుంటున్న సంస్థలు, సామాన్య ప్రజల నుంచి కూడా కమీషన్ విషయసేకరణ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ తతంగం అంతా పూర్తయితే తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ సాగునీటి, ఆర్ధిక శాఖల మంత్రి హరీష్ రావు, ఇంకా పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కేసీఆర్ సొంత ఆలోచనల నుంచి ఉద్భవించి, ఆయన పర్యవేక్షణలో రూపుదిద్దుకుంది కనుక చివరికి ఈ అవకతవకలకు ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.