Friday, November 22, 2024

దాచేపల్లి మండలంలోని రైతులందరూ ఈ క్రాప్ బుకింగ్ మరియు ఈకేవైసీ గడువు తేదీలోగాచేయించుకోవాలి మండల వ్యవసాయ అధికారి : డి పాపకుమారి :

నారద వర్తమాన సమాచారంఈ క్రాప్ బుకింగ్ & ఈకేవైసీ కి చివరి తేదీ 23.09.2024మండలంలోని రైతులందరూ ఈ క్రాప్ బుకింగ్ మరియు ఈకేవైసీ గడువు తేదీలోగా చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి డి పాపకుమారి దాచేపల్లి వారు తెలియజేసి ఉన్నారు.
ఈ క్రాప్ బుకింగ్ మరియు ఈ కేవైసీ చేయించుకుంటేనే పంట నష్టం ఏమన్నా జరిగితే పంట నష్టం రావాలన్నా,
క్రాపు ఇన్సూరెన్స్ రావాలన్నా,
పంట గవర్నమెంట్ కి అమ్ముకోవాలనుకున్న,
సున్నా వడ్డీ పంట రుణాలు రావాలన్నా
ఖచ్చితంగా రైతులందరూ ఈక్రా బుకింగ్ మరియు ఈ కేవైసీ చేయించుకోవాలి.ఈ రోజు మండలంలోని పొందుగుల మరియు గామాలపాడు రైతు సేవా కేంద్రాలను విసిట్ చేయడం జరిగింది. అక్కడ ఈక్రాప్ బుకింగ్ మరియు ఈ కేవైసీలను పరిశీలించడం జరిగింది.అదేవిధంగా గామాలపాడులో పత్తి పంటను పరిశీలించడం కూడా జరిగింది సూక్ష్మ పోషకాలు అయినటువంటి మెగ్నీషియం లోపాన్ని గమనించటం జరిగింది, దీనికి గాను మెగ్నీషియం సల్ఫేట్ 2 % ద్రావణాన్ని పిచికారి చేసుకోవాలని,
అలాగే పూత పిందే రాలకుండా బోరాన్ ను, సూక్ష్మ పోషకాల లోపలకి
F4/F6 లను స్ప్రే చేసుకోవాల్సిందిగా రైతులకు తెలియజేయడం జరిగింది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading