నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్
పల్నాడు జిల్లాలోని అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ అయిన పొందుగల చెక్ పోస్ట్ ను ఆకస్మిక తనిఖీ చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్
అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులు పనితీరు చాలా కీలకం
తెలంగాణ రాష్ట్రం నుండి పల్నాడు జిల్లాలోకి అక్రమంగా మద్యం నగదు మరియు ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన చర్యలు.
పొందుగల అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద ఆకస్మికంగా తనిఖీ చేసి, సిబ్బంది పనితీరును పరిశీలించి సిబ్బంది కి దిశా నిర్దేశం చేసిన ఎస్పీ
పొందుగల అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ నుండి మద్యం నగదు అక్రమ రవాణా జరగకుండా చూసుకోవాలని తెలియజేశారు. అక్రమంగా రవాణా చేస్తున్న మద్యం, నగదు దొరికితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ
గంజాయి, నాటు సారా, అక్రమ మధ్యము, నగదు మరియు ఇతర నిషేధిత అక్రమ రవాణాలను అరికట్టవలసిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉన్నదని, ఎటువంటి అక్రమ రవాణా జరగకుండా పోలీస్ అధికారులు తగు చర్యలు తీసుకొని, బోర్డర్ చెక్ పోస్ట్ ద్వారా మరియు అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ల ద్వారా వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేయాలని,
ప్రతి చెక్ పోస్ట్ వద్ద పోలీస్ సిబ్బంది, అధికారులచే నిత్యము వాహనాలను ఆపి పరిశీలిస్తూ, నిషేధిత వస్తువుల మరియు మద్యం, నగదు అక్రమ రవాణా ను అరికట్టుటకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని చెక్ పోస్ట్ విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులను మరియు సిబ్బందిని ఆదేశించారు.
ఈ తనిఖీలో దాచేపల్లి సిఐ జి. వెంకటరావు యస్.ఐ శివ నాగరాజు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.