నారద వర్తమాన సమాచారం
సాహితి సమైక్య సత్తెనపల్లి వారి ఆధ్వర్యంలో గుర్రం జాషువా 129 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు
తన సాహితీ సౌరభంతో సామాజిక రుగ్మతలను ఎదిరించిన విశ్వ మానవుడు గుర్రం జాషువా అని రాష్ట్ర గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి రాసంశెట్టి నరసింహారావు అన్నారు శనివారం రాత్రి పల్నాడు జిల్లా క్రోసూరు జయభారత్ పాఠశాల ఆడిటోరియంలో విశ్వ నరుడు జాషువా సేవ సాహితి సమైక్య సత్తెనపల్లి వారి ఆధ్వర్యంలో గుర్రం జాషువా 129 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు సభకు సేవా సమితి అధ్యక్షుడు లయన్ ముట్లూరు వెంకయ్య అధ్యక్షత వహించగా ఉపాధ్యాయులు చిలుకా సురేష్ బాబు స్వాగతం ఉపన్యాసం చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠ్య పుస్తకాల రచయిత విశ్రాంతి ఉపాధ్యాయుడు ఊటుకూరు ప్రసాదరావు కొయ్యలగూడెం మాట్లాడుతూ సమకాలిన సమాజం పోకడలకు అద్దం పట్టిన కావ్యం గుర్రం జాషువా రచించిన గబ్బిలం అన్నారు కాటికి వెళ్లాక పెద్ద చిన్న అనే కులాల తేడా లేదని పేద ధనిక అనే తారతమ్యం లేదని అందరూ సమానం అనే భావనను కలిగించిన వ్యక్తి జాషువా అని అన్నారు ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన ఊటుకూరి ప్రసాదరావు, మన్నెం శ్రీనివాసరావు, శిఖా శాంసన్, ముత్యాల తిరుమలరెడ్డి, అనుమల పూర్ణచంద్రరావు, గోగిరెడ్డి సాయిరాం రెడ్డి ల ను శాలువా, బొకే, పూలదండ, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు వై ప్రసాదరావు గణేష్, జై భారత్ పాఠశాల అధినేత టీ జైనేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.