Thursday, November 21, 2024

దుర్గా సప్తశతి పారాయణ విధానం. ?? ఏలా చేయాలి..?

నారద వర్తమాన సమాచారం

దుర్గా సప్తశతి పారాయణ విధానం. ?? ఏలా చేయాలి..?

దేవీనవరాత్రులు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి. అక్టోబర్ 3 వ తేదీ నుంచి 12 వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనుంది.

ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి వరకూ తొమ్మిది రోజులను నవరాత్రులు అంటారు. నవరాత్రులంటే మహిళలు దేవిని స్మరిస్తూ పండగ చేసుకుంటారు. ఈ అమ్మవారి ఆరాధనా మహోత్సవాన్ని ‘శరన్నవరాత్రి ఉత్సవాలు’గా, ‘దేవీనవరాత్రులు’గా పిలుస్తుంటారు. మహాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఈ తొమ్మిదిరోజుల పాటు తొమ్మిది రూపాలలో అలంకరించి పూజించడం జరుగుతుంటుంది.

భక్తులు ఈ తొమ్మిదిరోజుల పాటు దీక్ష చేపట్టి, ఏకభుక్త వ్రతాన్ని ఆచరిస్తూ అమ్మవారిని పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. శరన్నవరాత్రులలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఎవరైతే తనని పూజిస్తారో, వాళ్లు తనకి అత్యంత ప్రీతిపాత్రులని అమ్మవారే స్వయంగా చెప్పినట్టుగా పురాణాలు వెల్లడిస్తున్నాయి.

దేవీ నవరాత్రులు ఎంతో విశిష్టమైనవి, మహా పవిత్రమైనవి. ఈ తొమ్మిది రోజుల పాటు ఒక్కోరోజు ఒక్కో రూపంగా అలంకరించబడిన అమ్మవారిని దర్శించుకోవడం వలన అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయి.

ఇక దేవినవరాత్రి పూజలు చేయుట, అనునది అనాదికాలంగా వస్తున్న శాస్త్రవిధి. “అశ్వనీ” నక్షత్రంలో కలసివచ్చిన పూర్ణిమమాసమే “ఆశ్వీయుజమాసం” అవుతుంది

ప్రథమాశైలపుత్రి, ద్వితీయా బ్రహ్మచారిణీ
తృతీయాచంద్రఘంటీతి, కూష్మాండేతి చతుర్థికీ
పంచమా స్కందమాతేతి షష్టాకాత్యాయనేతి చ
సప్తమా కాళరాత్రిచ అష్టమాచాతి భైరవీ
నవమా సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గా ప్రకీర్తితా.

మూర్తులు వేరైనా మూలపుటమ్మ ఒకరే! అలంకారాలు వేరైనా అమ్మదయ అందరిపట్ల ఒకటే! హిందువులు అత్యంత ప్రీతిపాత్రంగా ఎంతో వైభవంగా నిర్వహించే పండుగలలో ఈ “దసరావైభవం” ఒకటి. ఇది పదిరోజులు పండుగ అయినప్పటికి దేవిని రోజుకో అవతారంగా అలంకరించి అమ్మవారికి అర్చనలుచేసి, నవవిధ పిండివంటలతో నివేదనలుచేస్తూ విశేష పూజలతో పాటు శ్రీలలితా సహస్రనామ పారాయణ నిత్యము గావిస్తూ “శరన్నవరాత్రులు” గా వ్యవహరిస్తారు.

శ్రవణానక్షత్రయుక్త ‘దశమి’ తిథిన విజయదశమితో ఈ దసరావైభవాలు పూర్తిచేస్తారు. దసరాకు మరోపేరు “దశహరా” అంటే! పది పాపాలను హరించేది అని అర్థం చెప్తారు దైవజ్ఞలు. ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి, హస్తానక్షత్రములో కూడియున్న శుభదినాన ఈ దేవీ పూజ ప్రారంభించడం చాలా మంచిదని మార్కండేయ పురాణం చెబుతోంది. అందువల్ల ఈ రోజు నుంచి నవరాత్రులు ప్రారంభిస్తారు.

అందులో మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలని పెద్దలు చెబుతున్నారు.

తొలిరోజు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి
శ్రీ గాయత్రీ దేవి అలంకారం
శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం
శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారం
శ్రీ మహా చండీ దేవి అలంకారం
శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారం
శ్రీ సరస్వతీ దేవి అలంకారం (మూలానక్షత్రం)
శ్రీ దుర్గాదేవి అలంకారం
శ్రీ మహిషా సుర మర్ధనీ దేవి అలంకారం
శ్రీ ఉత్సవాల ఆఖరు రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం లో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు.సాయంత్రం కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహించనున్నారు.

దుర్గా సప్తశతి పారాయణ విధానం. ??
ఎంతో విశిష్టత కలిగిన ఈ దుర్గా సప్తశతి యందు 13 అధ్యాయాలున్నాయి. నవరాత్రి తొమ్మిదిరోజులలోను ఈ 13 సంఖ్యగల అధ్యాయాలను ఎలా పారాయణ చేయాలి ? అనే అనుమానం సహజంగానే ఎవరికయినా కలుగుతుంది. ఇందుకు 3 విధాలను ఇక్కడ సూచించటం జరిగింది. దేవీ కటాక్షం పొందగోరువారు ఈ 3 విధాలలో ఏది ఎన్నుకున్నా ఫలితం పొందడంలో మాత్రం ఎటువంటి తేడా ఉండదు. కనుక భక్తులు తమకు అనుకూలమైన రీతిని ఎంపిక చేసుకోగలరు.

మరో అంశం…..ఈ పారాయణ సమయంలో-ఆయా అధ్యాయాల్లో దేవతలు, ఇంద్రుడు, మునులు మున్నగు వారి స్తోత్రములు సందర్బానుసారం చేర్చబడి ఉన్నాయి.అవి ఇంకా అద్బుత ఫలదాయకమైనవి.

  1. మొదటి విధానము:
    ఆశ్వయుజ మాసములోని శుక్లపక్ష పాడ్యమి మొదలు నవమి వరకు తొమ్మిదిరోజులను శరన్నవ రాత్రములు అంటారని తెలిసినదే!ఈ 9 రోజులు అత్యంత పుణ్యప్రదమైన రోజులు. పారాయణ, నామజపం, దేవీస్తోత్రం, ఉపాసన, అర్చన….ఎవరికి ఏది అనుకూలమైతే అది ఆచరించటం అద్బుత పుణ్యదాయకం.

మొదటి రోజు మొదలు తొమ్మిది రోజులూ ప్రతి దినమూ 13 అధ్యాయాములను పారాయణ చేయుట ఒక పద్దతి, పారాయణకు శ్రద్దభక్తులు అత్యంత అవసరం. 13 అధ్యాయాలు ప్రతి రోజు (కూర్చున్న ఆసనం పై నుంచి కదలకుండా) చేయడానికి కనీసం వారి వారి సామర్థ్యాన్ని బట్టి ఐదారుగంటలకు తక్కువ లేకుండా పట్టవచ్చు! దైవకృప అపారంగా గల వారికి ఇది సాధ్యపడవచ్చు.!.

మిగిలినవారికి మరో రెండు విధాలు:

  1. రెండో విధానము:
    1.వరోజు (పాడ్యమి) ఒకే ఒక్క ప్రధమాధ్యాయం మాత్రమే
    2.వరోజు(విదియ) రెండు,మూడు,నాలుగు అధ్యాయాలు
    3.వరోజు(తదియ) ఐదు మొదలు పదమూడు అధ్యాయాలను పూర్తిగా

పైన చెప్పినట్లు-
తొమ్మిది రోజులూ పుణ్యప్రదమైనవే కనుక మూడేసి రోజులను పారాయణకు ఎంచుకోవచ్చును. నియమం మాత్రం ఒక్కటే! “ఏ మూడు రోజులయినా”అన్చెప్పి ఒకటో రోజు చేసి, రెండ్రోజుల తర్వాత కొన్ని అధ్యాయాలు, మరో రెండ్రోజులు ఆగి కొన్ని అధ్యాయాలు చదువరాదు.

పాడ్యమి, విదియ, తదియలు ఎవరికైనా ఇబ్బందుల-ఆటంకాల దృష్ట్యా కుదరనపుడు-చివరి మూడు రోజులను(సప్తమినాడు కాక), లలితా త్రిపుర సుందరీ దేవి, దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిని ఎన్నుకొనవచ్చును. అనగా 10వరోజు అయినప్పటికీ-దసరా పండుగ (విజయదశమి) రోజును కూడా కలుపుకోగలరు.

  1. మూడో విధానము:
    మొదటిరోజు-మొదటి అధ్యాయం

రెండవరోజు-రెండు, మూడు అధ్యాయాలు
మూడవరోజు-నాలగవ అధ్యాయం
నాల్గువరోజు-ఐదు, ఆరు అధ్యాయాలు
ఐదవరోజు-ఏడవ అధ్యాయం
ఆరవరోజు-ఎనిమిదో అధ్యాయం
ఏడవరోజు-తొమ్మిది, పది అధ్యాయాలు
ఎనిమిదవరోజు-పదకొండవ అధ్యాయం
తొమ్మిదవరోజు-పన్నెండో అధ్యాయం, పదమూడో అధ్యాయం.

ఈ ప్రకారం పైన సూచించిన విధాలలో ఏదైనా ఎన్నుకోవచ్చు! అయితే, పారాయణ చేస్తున్నంతకాలం ఈ విషయాలపై శ్రద్ద వహించాలి.

దుర్గాష్టోత్తర శతనామ/ సహస్ర నామములతో (ఏదైనాసరే ఒకటి) పూజించుట. ధూపదీప నైవేద్యాలు అర్పించుట. పారాయణకు ముందు అక్షతలు చేతులోకి తీసుకొని, తాము కోరుకున్న కోరికను మనస్సులోనే చెప్పుకొనుట. పారాయణం అయిన వెంటనే అష్టోత్తర శత నామస్తోత్రం పఠించుట. పునఃపూజ చేయుట.

పానకం/వడపప్పు(పంద్యారాలకు) కొబ్బరి, బెల్లంపొంగలి/దద్యోజనం/వడలు వంటి పదార్థాలలో ఎవరి శక్త్యానుసారం వారు మహానైవేద్యం సమర్పించుట. పూర్ణిమ/శుక్రవారంనాటికి (ఏవైనా అనివార్యమైన ఆటంకాలు ఎదురైనప్పుడు) పారాయణ ముగిసేలా చూసుకొనుట. పారాయణ పరిసమాప్తమైన రోజున,ముత్తైదువను భోజనానికి ఆహ్వానించి, వస్త్రం, ఎర్రనిది దక్షిణ సహితంగా(9 సంఖ్య ఉండేలా) దానం ఇచ్చి పాదనమస్కారం చేయుట.

ప్రతి పారాయణ భాగానికి ముందుగా ఈ 3 శ్లోకాలు పఠించుట.
శరణాగత దీనార్త పరిత్రాణ పరాయతే|
సర్వ స్యార్తి హరేదేవి నారాయణి నమోస్తుతే||

సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే|
శరణ్యేత్ర్యంబక దేవి నారాయణి నమోస్తుతే||

సర్వబాధా వినిర్ముక్తో ధన ధాన్య సుతాన్వితః|
మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి నసంశయః||

దుర్గాసప్తశతీ పారాయణం చేసేవారు ముఖ్యంగా గమనించాల్సింది:
ఎటువంటి కోపతాపాలకిగాని/వికారాలకుగాని లోను కారాదు.
శుచి శుభ్రతలను పాటించడం అత్యంత కీలకం.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading