నారద వర్తమాన సమాచారం
మంగళగిరి
మంగళగిరి పరిదిలోని ఎక్సైజ్ శాఖ నూతన మద్యం పాలసీలపై పలు అంశాలపై నూతన ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు
మంగళగిరి ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ కార్యలయంను డాక్టర్ కే శ్రీనివాసులు డిప్యూటీ కమీషనర్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ గుంటూరు, అరుణ కూమారి ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, మారయ్య బాబు ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ లు సందర్శించారు. ఈ సందర్బంగా స్టేషన్ కు సంబంధించిన వివరాలను అందచేసిన, వీరాంజనేయులు ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ సిఐ మంగళగిరి, ఎస్ఐ పద్మజా మరియు సిబ్బంది.
డాక్టర్ కే శ్రీనివాసులు డిప్యూటీ కమీషనర్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ గుంటూరు కామెంట్స్
మధ్యం పాలసీ పై వివరాలను అందచేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు వారు షాపులకు టెండర్లు వేయవచ్చని అయితే ఏ షాపు కోసం ఏ ప్రాంతం వారు టెండర్లు వెస్తున్నారు దానికి ఓ నెంబరు ఇవ్వటం జరుగుతుందని తెలిపారు
ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు నగదు అన్ లైన్ ద్వారా బ్యాంకు ల నుంచి డి డి ల రూపంలో దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు
ఈ నగదు పూర్తిగా నాన్ రిఫండబుల్ నగదని దరఖాస్తు దారులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు
ఈ టెండర్లు పూర్తి పారదర్శకంగా ఉంటాయని వేసిన టెండర్లు గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా కలెక్టర్ల వారి సమక్షంలో తెరవబడతాయని వాటి కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నామని తెలియజేశారు
ప్రభుత్వ విధి విధానాలపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారని దీని ప్రకారం షాపులను కేటాయింపు చేస్తామని తెలిపారు.
వాటికి సంబందించి ప్రతి షాపుకు ఎంత మంది అయిన టెండర్లు వేయవచ్చని దానికి సంబంధించి ఒక్కో టెండర్ కు 2 లక్షల రూపాయలు చెల్లించాలని తెలిపారు.
పూర్తి వివరాలు గెజిట్ నోటిఫికేషన్ లో ఉన్నాయని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ పద్మజాలతో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.