నారద వర్తమాన సమాచారం
బిఆర్ఎస్ పార్టీ ఎన్సీపీలో విలీనానికి ముహూర్తం పిక్స్?
హైదరాబాద్:
తెలంగాణలో 10 సంవత్స రాలు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిప క్షానికి పరిమితం అయింది, ఇక లోక్ సభ ఎన్నికల్లో అయితే ఒక్క సీటు కూడా సంపాదించు కోకపోవడం తో అధికార పార్టీకి బలాన్ని ఇచ్చింది.
మరి కొద్ది రోజుల్లోనే మహారాష్ట్ర లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరి ణామాలు చోటు చేసుకుంటున్నాయి.
గతంలో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి జాతీయ రాజకీయాలు చేసేందుకు రంగంలోకి దిగిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తర్వాత మహా రాష్ష్ర పైనే పెద్దెత్తున ఫోకస్ పెట్టారు. అంతేకాదు మహారాష్ట్రలో పార్టీని సైతం ఏర్పాటు చేశారు.
ఎన్నోసార్లు మహారాష్ట్రలో బహిరంగ సభలను కూడా నిర్వహించారు. అయితే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైంది. దీంతో అప్పటి నుంచి కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి నోరుమెదపలేదు. ఇప్పటి వరకు జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టలేదు.
దీంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నేతల పరిస్థితి పక్క పార్టీలవైపు వెళ్లేలా చేసింది. ఈ క్రమంలోనే తాజాగా మహారాష్ట్రలోని బీఆర్ఎస్ పార్టీలోని నాయకులు శరద్ పవార్ ఆధ్వర్యంలో ఎన్సీపీ లో చేరి బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయనున్నారు.
తాజాగా మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు శరద్ పవార్ తో కీలక భేటీ నిర్వహించారు. అనంతరం అక్టోబర్ 6వ తేదీన పూణే లో ఎన్సీపీ ఆధ్వర్యం లో జరిగే కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీని నేత లంతా,మూకుమ్మడిగా అక్కడ బీఆర్ఎస్ పార్టీని ఎన్సీపీలో విలీనం చేయబోతున్నారని సమాచారం..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.