నారద వర్తమాన సమాచారం
దేవీ నవరాత్రులు మొదటి రోజు అలంకారం
శ్రీ బాలాత్రిపురసుందరి
విజయవాడ:-
శరన్నవరాత్రి ఉత్సవములలో తొలి రోజు దుర్గమ్మ
బాలత్రిపుర సుందరిగా కనకదుర్గమ్మ వారు దర్శనమిస్తుంది. త్రిపురిని భార్య
త్రిపుర సుందరీ దేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన
గౌరీదేవి అని అర్ధము. మనస్సు, బుద్ధి, చిత్తము,
అహంకారము త్రిపుర సుందరీదేవి అధీనములో ఉంటాయి.
అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన అమ్మను
ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి. నిత్య
సంతోషము కలుగుతుంది. త్రిపుర సుందరీదేవి శ్రీ
చక్రములోని త్రిపురాత్రయములో మోదటి దేవత. కనుక
ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహము కోసము
బాలార్చన చేస్తారు. సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా
త్రిపురసుందరీదేవి భక్తుల పూజలందుకుంటోంది.
సమస్త దేవి మంత్రాలలో కంటే బాలా మంత్రం ఎంతో గొప్పది అంటారు. విద్యోపాసకులకు మొట్టమొదట బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరీ దేవి నిత్యం కొలువుండే శ్రీ చక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత బాలాదేవి. బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర సుందరీ దేవి అనుగ్రహాన్ని పొందగలుగుతారని.. దసరా మహోత్సవాలలో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం శ్రీబాలాదేవి అని ప్రతీతి.
.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.