నారద వర్తమాన సమాచారం
చిలకలూరిపేట డిపోలో నూతన బస్సులను ప్రారంభించిన ప్రత్తిపాటి
చిలకలూరిపేట
అయిదేళ్ల పాలనలో జగన్ రెడ్డి షెడ్డుకు చేర్చిన ప్రజారవాణ వ్యవస్థను ప్రజాప్రభుత్వంలో సీఎం చంద్రబాబు బ్రాండ్‌న్యూగా మార్చుతున్నారని హర్షం వ్యక్తం చేశారు మాజీమంత్రి, చిలకలూరి పేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కొత్త బస్సుతో కళకళలాడేలా చేస్తున్నారన్నారు. చిలకలూరిపేట ఆర్టీసీ డిపో పరిధిలో 4 కొత్త బస్సులను శుక్రవారం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు జెండా ఊపి ప్రారంభించారు. 2 ఇంద్ర, 2 పల్లె వెలుగు బస్సులు అందుబాటులోకి వచ్చాయి. బస్సులో కొంతదూరం ప్రయాణించి ప్రయాణికులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఎక్కువకాలం తిరిగి సమయం ముగిసిన బస్సులను తొలగించి అధునాతన వాటిని ప్రవేశపెట్టడం ద్వారా ప్రజలు కాలుష్యం, అనారోగ్యాల బారినపడకుండా చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. అందుకోసమే రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ద్వారా కొన్ని బస్సులు, అద్దె ప్రాతిపదికగా కొన్ని బస్సులు ప్రవేశ పెడుతున్నారని అన్నీ కూడా బ్రాండ్ న్యూ అని తెలిపారు. అందులో భాగంగానే బీఎస్-6 బస్సులను ఒక్కొక్కటి రూ.కోటి విలువచేసే ఇంద్ర బస్సులు రెండింటిని చిలకలూరిపేట డిపోలో ప్రారంభించామన్నారు. గతంలో 2 బస్సులను ప్రారంభించామని, 2 పల్లెవెలుగు బస్సులు కూడా ప్రారంభించామని, మొత్తం 6 బస్సులు చిలకలూరిపేట డిపోకే రావడం జరిగిందన్నారు. ఇంకా మరికొన్ని బస్సులు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేవిధంగా, కాలుష్యం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా వందలాది కొత్త బస్సులు అందుబాటులో వచ్చాయన్నారు . వీటి సాయంతో నిర్దేశిత గమ్యస్థానాలకు సమయానికి ప్రయాణికులను సురక్షితంగా చేర్చేందుకు ఆర్టీసీ వీలు చిక్కుతుందన్నారు. సేఫ్ జర్నీ అంటే ఆర్టీసీ అని రాష్ట్ర ప్రజలంతా భావిస్తున్నారని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరుతున్నాం అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైందని, ఆర్టీసీని పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రయాణికులకు నాణ్యమైన సేవలందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.