నారద వర్తమాన సమాచారం
బ్రహ్మచారిణి దుర్గ దేవి..🌷 బ్రహ్మచారిణి దుర్గ
🌹బ్రహ్మచారిణి దుర్గా, దుర్గాదేవి అవతారాల్లో రెండో అవతారం. గురువు వద్ద బ్రహ్మచార్యాశ్రమంలో తోటి విద్యార్థినులతో ఉండే అమ్మవారి అవతారం ఇది.
🌹నవదుర్గల్లో రెండో అవతారమైన బ్రహ్మచారిణి దుర్గా దేవిని నవరాత్రుల్లో రెండోరోజున పూజిస్తారు. తెల్లని చీర దాల్చి, కుడి చేతిలో జప మాల, ఎడమ చేతిలో కమండలంతో ఉంటుంది బ్రహ్మచారిణి దేవి.
పురాణ గాథ
🌹పురాణాల ప్రకారం పార్వతీ దేవి శివుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుకుంది. ఆమె తల్లిదండ్రులైన మేనకా, హిమవంతులు అది దుర్ఘటమైన కోరిక అని చెప్పినా, ఆమె పట్టుదలతో శివుని కోసం తపస్సు చేసింది.
🌹తారకాసురుడనే రాక్షసుడు, శివ సంతానం చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో చనిపోకుండా వరం పొందాడు. సతీదేవి వియోగంలో ఉన్న శివుడు తిరిగి వివాహం చేసుకోడనీ, ఆయనకు సంతానం కలిగే అవకాశం లేదు కాబట్టి ఆ రాక్షసుడు అలా వరం కోరుకున్నాడు.
🌹కానీ భవానీ పార్వతీ దేవిగా జన్మెత్తి, శివుని కోసం తపస్సు చేస్తోందని ముందే తెలిసిన దేవతలు పార్వతీదేవిపై శివుడికి ప్రేమ కలిగేలా చేయమని మన్మధుణ్ణి కోరతారు.
🌹శివునిపై పూలబాణం వేసిన మన్మధుణ్ణి దగ్ధం చేస్తాడు శివుడు. నిరాశ చెందని పార్వతి శివుని లాగానే ఉండేందుకు బ్రహ్మచారిణి అయి, తపస్సు చేస్తూ ఉంటుంది. అలా బ్రహ్మచారిణి అవతారంలో ఘోరతపస్సు చేస్తుంది అమ్మవారు.
🌹ఈ విధంగా సన్యాసిని అయి తిరుగుతూ, తనకు సేవ చేస్తున్న పార్వతి పట్ల అనురాగం పెంచుకుంటాడు శివుడు. కానీ సతీదేవి తప్ప ఇంకెవరూ తన భార్యా కాలేరని భావించి శివుడు, తన గురించి తానే పార్వతీదేవికి తప్పుగా చెప్తాడు.
🌹తాను దొంగ సన్యాసిని అంటూ స్వనింద చేసుకుంటాడు. కానీ పార్వతీ దేవి అ మాటలను నమ్మకుండా తన తపస్సు తీవ్రతరం చేస్తుంది. చివరికి శివుని పట్టుదలపై పార్వతి ప్రేమే గెలవడంతో ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు.
ధ్యాన శ్లోకం
దధానా కర్ పద్మాభ్యామక్ష్మల కమండలూ |
దేవీ ప్రసీదతు మయీ బ్రహ్మచారిణ్యనుత్తమా ||
🌹భావం: ఓ బ్రహ్మచారిణి, జపమాల మరియు కమండలములను తన చేతులలో పట్టుకొని నన్ను దీవించుము.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.