నారద వర్తమాన సమాచారం
బతుకమ్మ అంటే తెలంగాణ సంస్కృతీ, సాంప్రదాయాలను చాటి చెప్పే పండగ: మంత్రి సీతక్క
తెలంగాణ
బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో బతుకమ్మ సంబరాలు శనివారం సాయంత్రం ఘనంగా జరుపుకున్నారు.
బతుకమ్మ అంటే సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా సచివాలయ ఉద్యో గ సంఘాలు బతుకమ్మ సంబరాలు అట పాటలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. బతుకమ్మ అంటే తెలంగాణ సంస్కృతీ అని, బతుకమ్మ అంటే చెరువులతో ముడిపడి ఉన్న బంధమని, మనం ఎంత ఎత్తుకు ఎదిగినా పూర్వీకులు ఇచ్చిన సంప్రదాయాన్ని భవిషత్ తరాలకు అందిం చాలని,మంత్రి సీతక్క అన్నారు.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పువ్వులను, చెరువులను పూజించే పండుగ అని, పూర్వం చెరువులపై మన జీవితాలు ఆధారపడి ఉండేవని, బతుకమ్మల్లో గౌరమ్మ వల్ల చెరువులు శుద్ధి అయ్యే వని, బతుకమ్మను కాపాడుకుందాం, మరిన్ని యుగాలు ఉండేలా భవిష్యత్‌కు అందిద్దామని మంత్రి సూచించారు.
తెలంగాణ స్టేట్ సెక్రటేరి యట్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ ప్రేమ్, డా.అంబేద్కర్ సచివాలయ మహిళా ఉద్యోగుల అధ్యక్షురాలు పద్మావతి, జనరల్ సెక్రటరీ గీత, లావణ్యతో పాటు తెలంగాణ సచివాలయ ఉద్యోగులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.