Thursday, November 21, 2024

ఇదేం ఇసుక పాలసీ?: ఎమ్మెల్సీ బొత్స

నారద వర్తమాన సమాచారం

ఇదేం ఇసుక పాలసీ?: ఎమ్మెల్సీ బొత్స

కూటమి ప్రభుత్వం ఇసుక విధానంపై బొత్స విమర్శలు

ఇసుక పాలసీలో స్పష్టత లేదని వ్యాఖ్యలు

కూటమి పార్టీ నేతలు యధేచ్ఛగా ఇసుక దోచుకుంటున్నారని ఆరోపణ

కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక విధానంలో స్పష్టత లేదంటూ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పెదవి విరిచారు. ఇసుక పాలసీలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. నాలుగు నెలలవుతున్నా, ఇసుకపై సరైన విధానమంటూ లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఓవైపు ఉచిత ఇసుక అని ప్రచారం చేసుకుంటూనే, మరోవైపు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి పార్టీల నేతలు మాత్రం ఇసుకను యధేచ్ఛగా దోచుకుంటున్నారని బొత్స ఆరోపించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 117 రోజులు గడుస్తున్నా, భవన నిర్మాణ కార్మికులకు పనుల్లేవని, ఇసుకపై ఆధారపడిన వారంతా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading