నారద వర్తమానం సమాచారం
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు శ్రీకారం చుట్టారు.
పేద విద్యార్థులకు అంత ర్జాతీయ స్థాయి నాణ్యతతో కూడిన విద్యను అందిం చాలన్న లక్ష్యంతో సమీకృత గురుకులాల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలిద శలో 28 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రే టెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను తీసుకురావాలని సీఎం రేవంత్ నిర్ణయించారు.
ప్రస్తుతం ఉన్న గురుకు లాలను కొనసాగిస్తూనే.. అత్యాధునిక వసతులతో సమీకృత భవనాలను నిర్మించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా కొడంగల్, మధిర, హుస్నాబాద్, నల్లగొండ, హుజూర్‌నగర్, మంథని, ములుగు, పాలేరు, ఖమ్మం, వరంగల్, కొల్లాపూర్, అందోల్, నియోజకవర్గంలో పాటు…
చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, భూపాలపల్లి, అచ్చంపేట, స్టేషన్ ఘన్‌పూర్, తుంగతుర్తి, మునుగోడు, చెన్నూరు, షాద్‌నగర్, జడ్చర్ల, పరకాల, నారాయణఖేడ్, దేవరకద్ర, నాగర్‌కర్నూలు, మానకొండూరు, నర్సంపేటలో సమీకృత భవనాలను నిర్మించనుంది.
ఇక ఈ 28 ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్దితో సహా పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు శుక్రవారం భవన నిర్మాణాలకు భూమి పూజ చేశారు.
షాద్‌నగర్ నియోజక వర్గంలోని కొందుర్గులో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభు త్వం 10 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమిలేదని విమర్శించారు.
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు 10,006 పోస్టులు డీఎస్సీ ద్వారా ఇచ్చామని చెప్పారు. ఉపాధ్యాయుల బదిలీలతో పాటు ఉద్యోగ ఉన్నతి ఇందిరమ్మ ప్రభుత్వం కల్పించిందని, గత ప్రభుత్వం అనేక స్కూల్స్ పెట్టిందే తప్ప పక్క వసతి కల్పించడంలో విఫల మైందని ఆరోపించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.