నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయం
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో దీర్ఘాయుష్మాన్ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో “దీర్ఘాయుష్మాన్ బైక్ అంబులెన్స్” ను ప్రారంభించిన కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ ,
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
ఆపద సమయంలో ప్రతి నిమిషం ఎంతో కీలకం అలాంటి సమయంలో దీర్ఘాయుష్మాన్ బైక్ అంబులెన్స్ కు ఫోన్ చేస్తే (8340000108) ఒక డాక్టర్ ఒక నర్స్ ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుంటారు.
అంబులెన్స్ వచ్చేలోపు వీరు వచ్చి ప్రధమ చికిత్సకు అవసరమైన అత్యవసర మందులు మరియు ఆక్సిజన్ దెబ్బలు తగిలిన వారికి అందించి సత్వర చికిత్స చేసి ఆసుపత్రికి అంబులెన్స్ లో పంపడం జరుగుతుందని శ్రీ ఎస్పీ గారు తెలిపారు.
ఈ బైక్ అంబులెన్స్ ప్రమాదం జరిగిన వారికి ఎటువంటి రుసుము లేకుండా ఉచిత సేవ అందిస్తుందని తెలిపారు.
ఈ Service(సేవ) 24గంటలు గుంటూరు మరియు నరసరావుపేటలలో రేపటినుండి అందుబాటులో ఉంటాయని ఎస్పీ తెలిపారు.
ఈ బైక్ అంబులెన్స్ కు సంబంధించి చేయవలసిన ఫోన్ నంబర్ లు Emaegency Call
8340000108
8186000108
ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు డాక్టర్ చింతా కృష్ణ చైతన్య మరియు శ్రీకాంత్(మేనేజర్) పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.