Friday, November 22, 2024

🕉️శరన్నవరాత్రి ఉత్సవములలో అమ్మవారి అలంకారములలో చివరి రూపము శ్రీ రాజ రాజేశ్వరీ దేవి.🌺🔱🔯

నారద వసర్తమాన సమాచారం

🕉️శరన్నవరాత్రి ఉత్సవములలో అమ్మవారి అలంకారములలో చివరి రూపము శ్రీ రాజ రాజేశ్వరీ దేవి.🌺🔱🔯
శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం (12-10-2024)

🔱విజయదశమి
శరన్నవరాత్రి ఉత్సవములలో అమ్మవారి అలంకారములలో చివరి రూపము శ్రీ రాజ రాజేశ్వరీ దేవి. సకల భువన బ్రహ్మాండాలకు అమ్మ ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయములో పూజలందుకుంటుంది.🔱

🔯ఆమ్మను అపరాజితాదేవిగా కూడా భక్తులు పూజించే ఆచారము ఉన్నది. ఈమె స్వప్రాకాశ జ్యోతి స్వరూపిణి. పరమేశ్వరుని అంకము అమ్మకు ఆసనము. ఇఛ్ఛా, ఙ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరములుగా అనుగ్రహిస్తుంది. ఆమ్మ యోగమూర్తి. మాయా మోహిత మానవ మనోచైతన్యాన్ని రాజరాజేశ్వరీ దేవి ఉద్దెపితం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రమునకు అమ్మ అథిష్టాన దేవత.🔯

🪷మహాకాళీ మహాలక్ష్మీ మహాసారస్వతీ ప్రభా ఇష్టకామేశ్వరీ కుర్యాత్ విశ్వశ్రీః విశ్వమంగళమ్
షోడశీ పూర్ణ చంద్రాభా మల్లికార్జున గేహినీ ఇష్టకామేశ్వరీ కుర్యాత్ జగన్నీరోగ శోభనమ్
జగద్ధాత్రీ లోకనేత్రీ సుధా నిష్యంది సుస్మితా ఇష్టకామేశ్వరీ కుర్యాత్ లోకం సద్బుద్ధి సుందరమ్
పరమేశ్వర వాల్లభ్య దివ్య సౌభాగ్య సుప్రభా ఇష్టకామేశ్వరీ దద్యాత్ మాంగల్యానంద జీవనమ్🪷

🪴విజయథమినాడు దేదీప్య మానంగా వెలిగే, చిద్రూపి అయిన రాజరాజేశ్వరీ రూపంలో అమ్మ మనకు దర్శనమిస్తుంది. ఈ అమ్మను సేవిస్తే వృత్తి ఉద్యోగాల్లో వృద్ధి కలుగుతుంది. నిరుద్యోగులు వారి అర్హతలకు తగిన ఉద్యోగాన్ని పొందుతారు. విజయథమి నాడు రాజరాజేశ్వరి ఆశ్రిత రక్షపోషజననియై వర్ధిల్లుతుంది.💐

పురాణాల కథలను బట్టి, పూజా విధానాలను బట్టి నవరాత్రులు అందరికీ శక్తిని ఆరాధించేవైనప్పటికీ, ప్రత్యేకంగా విజయథమి క్షత్రియుల పండుగ అని తెలుస్తుంది. రాజులు యుద్ధాలకు వెళ్ళే కాలంలో చేసుకునే ఉత్సవంగా ప్రారంభమైన ఈ పండుగ కాలక్రమంలో ఆయా వృత్తుల వారు తమ అభ్యుదయాన్ని, జయాన్ని కాంక్షిస్తూ వారి వృత్తికి సంబంధించిన వస్తువులను పూజించే ఆచారం ఏర్పడింది. ఇప్పటికీ విజయదశమి ‘ఆయుధపూజ’ విశిష్టంగా కనిపిస్తుంది.

🕉️”అత్ర అపరాజితా పూజనం సీమోల్లంఘనం శమీ పూజనం దేశాంతర యాత్రార్థినాం ప్రస్థానచ హితం” అనే ప్రమాణం కూడా పూర్వపు యుద్ధకాలపు క్షత్రియులకే ఇది ఎక్కువ ఆచారంలో ఉన్నట్లు తెలుస్తుంది. వర్షాకాలం పోయి శరద్రుతువు ఆగమనం రాజులకు యుద్ధాలకు అనువైన కాలం. అందుకే ఆ రోజు అపరాజితను పూజించాలి. అనగా పరాజయం కలుగకుండా దేవిని ఉపాసించాలి. సీమోల్లంఘనం అంటే సరిహద్దులను దాటడం.విజయకాలంలో బయలుదేరి విజయం సాధించడానికి ఆ సమయంలో సీమోల్లంఘనం చెప్పబడింది. ఆ తర్వాత చెప్పబడింది శమీపూజ. అనగా జమ్మిచెట్టును పూజించడం. ఈ వృక్షానికి ఆయుర్వేద వైద్యంలో ఉన్న ప్రాధాన్యమధికం. సాయంకాల సమయంలో గ్రామ ప్రజలంతా ఊరి చివర, సరిహద్దుల్లోని శమీవృక్ష స్థానానికి వెళ్ళి అక్కడ పూజించి ఆ పత్రాలను ఒకరికొకరు ఇచ్చుకుంటారు. పెద్దలకు మిత్రులకు జమ్మి ఆకులను ఇచ్చి -🕉️

🌳”శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శనం”🌳

అంటూ ఆశీస్సులు, అభినందనలు పొందుతారు. ఇంతేగాక విజయదశమి రోజున పాలపిట్టను చూడడం జానపదుల ఆచారం. ”పాలపిట్ట దర్శనం కడుపునిండ భోజనం” అనే మాట జానపదుల నోళ్ళలో తిరుగుతుంది.సమస్త దేవతలకు, సమస్త మూర్తులకు అధిష్ఠానియై శ్రీచక్రస్థిత అయినటువంటి ఈ రాజరాజేశ్వరి ఉపాసన భవ బంధాలను తొలగించడమే కాకుండా, ఇహపర ముక్తిదాయిని. ఈ లోకంలో అత్యున్నత శ్రేణి పదవులను, భోగాలను అందిస్తూ పరలోక ముక్తిని కలిగించేటటువంటి తత్వం ఈ రూపానిదే. అందుకే ఈమెను చిద్రూపి పరదేవతగా కొలుస్తారు. అన్ని రకాల విజయాలకు మూలమైన ఈ తత్వ ఉపాసన అందరికీ అవసరమే. ఆ తల్లిని ఆరాదిద్దాం, సేవిద్దాం, ఆనందిద్దాం.

ఈ రోజున ఆకుపచ్చ రంగు చీరతో అమ్మవారు ధగధగా మెరిసిపోతుంది. ఈ రోజు అమ్మకు నైవేద్యంగా సమర్పించే పదార్థం లడ్డూలు, పులిహోర, బూరెలు, గారెలు, అన్నం.

🪴!! రాజ రాజేశ్వరి దేవి ప్రసాదం💐

!! పరమాన్నం కావలసినవి !!
చిక్కటి పాలు 6 కప్స్ ( 1 టిన్ మిల్క్ మేడ్ ) బియ్యం 1 కప్
Sugar 1,1/2 కప్స్
ద్రాక్షా, జీడిపప్పు 1/4 కప్
ఏలకలుపౌడర్ 1/2 స్పూన్
నెయ్యి 5 టేబల్ స్పూన్స్?

!! చేసే విధానం !!
ముందు దట్టమైన వెడల్పాటి పెద్ద గిన్నెలో కాస్త నెయ్యి వేసిఅందులో బియ్యం పోసి పచ్చి వాసన పోయెంత వరకు వేయించండి. తరువాత పాలు, ఏలక పౌడర్, వేసి కుక్కర్`లో 2 విజిల్ వచ్చెంత వరకు వుంచండి. అది పక్కన పెట్టి చిన్న మూకుడు ష్టవ్ పై వుంచిఅందులో కాస్త నెయ్యి వేసి ఈ ఎండు ద్రాక్ష. ద్రాక్షా, జీడిపప్పు దోరగా వేయించి వుంచండి. చల్లారిన కుక్కర్ మూత ఓపన్ చేసి వుడికిన అన్నానికి చెక్కరవేసి 5 నిముషాలు మళ్ళీ వుడికించి ( అలా వుడికి నప్పుడు బియ్యం పాలు చక్కర కలుసుకొని చిక్కగా కావాలి ) అందులో వేయించిన జీడిపప్పు అవి వేసి బాగా కలిపి కస్త నెయ్యి వేసి వేడి వేడి గా ఆ రాజ రాజేశ్వరిదేవికి నైవేద్యం పెట్టండి.

ప్రధాన దేవత ను సర్వాభరణములతో అలంకారం. పదవ రోజుఈ తొమ్మిది రోజులూ చేసిన అన్ని ప్రసాదములను నైవేద్యముగా ఏట్టాలి. 🪴

🪴💐సర్వేజనా సుఖినోభవంతు
ఓం శాంతి శాంతి శాంతిః 💐💐💐🪴🪴🍏🍎🍐🍊🍋🍍🥭🍑🍒🍈🫐🍓🍇🥥🥥

                             🕉️🕉️🕉️🕉️🕉️


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading