నారద వర్తమాన సమాచారం
బీజేపీలో జనసేన
విలీనం అవుతుందా?
పవన్ కళ్యాణ్ ప్లాన్ ఇదేనా?
ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో
మంచి మార్కులతో, మంచి ర్యాంకుతో సాగుతున్నారు. గత
నాలుగు నెలలుగా ఆయన వైసీపీ జోలికి వెళ్లకుండా.. జనసేన
నేతలను కూడా కంట్రోల్లో ఉంచుతూ.. ఓన్లీ పాలనపైనే ఫోకస్ పెట్టించడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా..
ఇటీవల తిరుమల లడ్డూ వివాదం తర్వాత పవన్ కళ్యాణ్..
ఒక్కసారిగా హిందుత్వ అంశాన్ని తెరపైకి తేవడం అందర్నీ
ఆశ్చర్యపరిచింది.
ఒక రకంగా ఇది ఆందోళన కూడా కలిగించింది.
ఏపీలో లేని మత రాజకీయాలకు పవన్ బీజం వేస్తున్నారా అనే
డౌట్ కొందరిలో వస్తోంది.
తాను సనాతన హిందువును అని గర్వంగా చెప్పుకుంటాను
అని తిరుపతిలోని వారాహి డిక్లరేషన్ సభలో పవన్ కళ్యాణ్
అనడమే కాకుండా.. ఏకంగా నాలుగు భాషల్లో ప్రసంగం చెయ్యడం వెనక బీజేపీ పెద్దల హస్తం ఉంది అనే వాదన వినిపిస్తోంది.
ఢిల్లీ పెద్దలకు తాను మాట్లాడిన విషయాలు చేరేందుకూ, వారికి తన ప్రసంగం అర్థమయ్యేందుకే పవన్ కళ్యాణ్ ఇలా వేర్వేరు భాషల్లో మాట్లాడారనే టాక్ వస్తోంది. తద్వారా అంతా బీజేపీ ప్లాన్ ప్రకారమే జరుగుతోందని కొందరు అంటున్నారు.
ఏపీలో 2029లో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. అప్పుడు
టీడీపీతోనే జనసేన కలిసి సాగుతుంది అనే గ్యారెంటీ లేదు.
రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. ఐదేళ్ల తర్వాత కూడా
కూటమిగానే వెళ్తే.. జనసేన కూటమి పార్టీగానే ఉండిపోతుంది
తప్ప.. పవన్ కళ్యాణ్ సీఎం అవుతారన్న గ్యారెంటీ లేదు.
అలా కాకుండా.. టీడీపీకి బ్రేక్ చెప్పి.. ఒంటరిగా బలంలేని బీజేపీ సపోర్టుతో.. ప్రజల్లోకి వెళ్తే.. జనసేన ప్రధాన పార్టీగా అవతరించి,
పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయన్నది ఒక
కోణం.
అందుకే ఇప్పటి నుంచే పవన్ కళ్యాణ్.. బీజేపీ వ్యూహం
ప్రకారం.. హిందుత్వ అంశాన్ని భుజానికి ఎత్తుకున్నారనే ప్రచారం
సాగుతోంది.
ఇక సోషల్ మీడియాలో 2029 నాటికి బీజేపీలో జనసేన
కలిసిపోతుంది అని మరో ప్రచారం జరుగుతోంది. ఐతే… ఇది జరిగే అవకాశాలు తక్కువ అనే వాదన కూడా ఉంది.
ఎందుకంటే… తన
అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో
కలిపేసినప్పుడు.. పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడ్డారు. తాను
ఏ పార్టీ నేతలనైతే తిట్టారో అదే పార్టీలో PRP కలిసిపోవడం
ఆయనకు నచ్చలేదని టాక్.
అందుకే పవన్ కళ్యాణ్ జనసేన
పార్టీని స్థాపించారని అంటారు. గత పదేళ్లుగా జనసేన ఒంటరిగాను సాగింది. మరో ఐదేళ్లు కచ్చితంగా సాగుతుంది. 15 ఏళ్లుగా సొంతంగా ఎదిగిన పార్టీని పవన్ కళ్యాణ్ విలీనం చేసేస్తారని అనుకుంటే అది పొరపాటే అవుతుంది.
నిజానికి 2029 నాటికి సీఎం చంద్రబాబుకి 79 ఏళ్లు వస్తాయి.
అప్పటికి ఆయన పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండే అవకాశాలు
తక్కువ. అందుకే ప్రస్తుతం ఆయన కొడుకైన నారా లోకేష్ పార్టీలో కీలకంగా ఎదుగుతున్నారు. అన్నీ తానై చూసుకుంటున్నారు.
రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందని వైసీపీ అధినేత జగన్ అంటున్నారంటే.. దాన్ని బట్టే లోకేష్ ఏ స్థాయిలో ఎదిగారో అర్థం అవుతోంది. అందువల్ల 2029లో టీడీపీ నుంచి లోకేష్, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ కీలకంగా ఉంటారు. అలాంటి సమయంలో.. మళ్లీ కూటమిగా అధికారంలోకి వస్తే.. అప్పుడు చంద్రబాబు తప్పుకుంటే.. సీఎం అయ్యే ఛాన్స్ లోకేష్ కంటే.. పవన్ కళ్యాణ్ కే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తన పార్టీని బీజేపీలో కలపాల్సిన
అవసరం పీకే కి లేనట్లే.
2029 నాటికి రాజకీయాలు ఎలా ఉంటాయో ఇప్పుడే ఊహించడం
తప్పవుతుంది. ఈ ఐదేళ్లలో ఏమైనా జరగొచ్చు. రాజకీయ నేతలు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఒక్కోసారి ఆ నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాల ముఖచిత్రాన్నే మార్చేయగలవు.
ఇటీవల కేంద్రంలో బీజేపీకి సొంతంగా మెజార్టీ రాలేదు. అందువల్ల జనసేనను బీజేపీలో కలిపేయమని బీజేపీ పెద్దలు అడిగే అవకాశాలు తక్కువ. పైగా ఏపీలో బీజేపీకి బలం కూడా చాలా తక్కువ. కాకపోతే, టీడీపీతో తెగతెంపులు చేసుకుంటే.. జనంలోకి
వెళ్లేందుకూ, పార్టీని అధికారంలోకి తెచ్చేందుకూ హిందుత్వ సరైన
అంశం అవుతుందని పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారనేది మరో
విశ్లేషణగా ఉంది. అందుకే ఇప్పటి నుంచి పవన్ ఆ దిశగా వ్యూహ॥ అమలుచేస్తున్నారని అంటున్నారు. ఏది నిజం, ఏది ఉత్తుత్తి ప్రచారం అనేది మున్ముందు తెలుస్తుంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.