నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్…
పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ(ఆర్మ్ డ్ రిజర్వ్)గా విధులు నిర్వహిస్తూ ఎస్పీ గా పదోన్నతి పొంది బదిలీ పై వెళుతున్న D.రామచంద్ర రాజు గారు. ఘనంగా సత్కరించిన పలికిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాస రావు ఐపిఎస్ మరియు పల్నాడు జిల్లా పోలీసులు.
1991 సం.లో పోలీసు శాఖకు ఎంపికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పలు చోట్ల విధులు నిర్వహించి, పల్నాడు జిల్లా అదనపు ఎస్పీగా గత మూడు సంవత్సరాల నుండి విధులు నిర్వర్తించడం జరిగింది. ప్రస్తుతం ఎస్పీ గా పదోన్నతి పొంది బదిలీలలో భాగంగా PTC విజయనగరం కు బదిలీ అయినారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్ మాట్లాడుతూ
రామచంద్ర రాజు నీతి నిజాయితీలతో పాటు క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. పోలీసు డిపార్ట్మెంట్లో వివిధ రకాలైన ఉద్యోగాలను మరియు తనకు అప్పగించిన బాధ్యతలను తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి అని కొనియాడారు. పోలీస్ ఉద్యోగం ఇతర ఉద్యోగాల లాంటిది కాదు ఎన్నొ కష్ట నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఈలాంటి పరిస్థితుల్లో పోలీస్ శాఖకు ఉన్నతమైన సేవలను అందించి అందరికి అదర్శవంతులుగా నిలిచారంటే చిన్న విషయం కాదు.
ఈరోజు ఎస్పీగా పదోన్నతి పొంది బదిలీపై వెళ్తున్న రామచంద్ర రాజు గారిని చూసి ఇప్పుడున్న ప్రతి పోలీస్ సిబ్బంది నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని చెప్పారు.
తన జీవితంలో ఎన్నో రకాలైన అంశాలను ఎదుర్కొని నిలబడి, ఒక వైపు పోలీస్ ఉద్యోగాన్ని, మరోవైపు వ్యక్తిగత జీవితంను అన్నింటిని సమపాలన చేస్తూ కలిసి మెలిసి ముందుకు సాగిపోవడం, తనకిచ్చిన విధులను విజయవంతం చేయడం ఇవన్నీ చాలా సాదారణ విషయం కాదు. ఈ అమూల్యమైన మీ ప్రయాణాన్ని ఇలాగే కొనసాగించండి. మీకు నాతో పాటు జిల్లా పోలీస్ అధికారుల తరపున మా హృదయపూర్వక శుభాకాంక్షలు అని తెలిపారు.
ఆఖరి రోజు కూడా తన ఉద్యోగ ధర్మాన్ని, కర్తవ్యాన్ని నిర్వహించడం ఒక్క పోలీస్ కే సాధ్యమని, ఉద్యోగ విషయంలో ఈ పోలీస్ శాఖకు నిరంతర సేవలు అందించిన మీకు ఈ డిపార్టుమెంటు తప్పకుండా రుణపడి వుంటుందని తెలిపారు.
అనంతరం పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డి. రామచంద్ర రాజు (ఆర్మ్ ఢ్ రిజర్వ్) ని శాలువాలతో, పూల మాలలతో ఘనంగా సత్కరించి,జ్ఞాపిక ను అందించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ఎస్పీతో అదనపు ఎస్పి( క్రైమ్) లక్ష్మీపతి , పరిపాలన విభాగం అదనపు ఎస్పి జె.వి సంతోష్
నరసరావు పేట డీఎస్పీ కె.వి నాగేశ్వర రావు , ఆర్మ్ద్ రిజర్వు డిఎస్పి గాంధీ రెడ్డి , సీఐలు,ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.