నారద వర్తమాన సమాచారం
రూ.4,500 కోట్లతో రేపు అనగా
అక్టోబర్ 14 నుంచి 21 వరుకు
ఏపీలో పల్లె పండుగ
అక్టోబర్ 14వ తేదీ నుంచి ఏపీ ప్రభుత్వం మరో నూతన కార్యక్రమం తీసుకురానుంది. పల్లె పండుగ పేరుతో వారం రోజుల పాటు కార్యక్రమాలు చేపట్టనుంది. ఆగస్ట్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీలలో గ్రామసభలు పెట్టి గ్రామాభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన పనులపై తీర్మానాలు చేశారు. ఈ తీర్మానాల్లో ఆమోదించిన పనులను అమలు చేసేందుకు ఈ పల్లె పండుగ కార్యక్రమం చేపట్టనున్నారు.
దాదాపు 4500 కోట్ల వ్యయంతో, 30 వేల పనులను మొదలుపెట్టేందుకు ఈ పల్లె పండుగ కార్యక్రమాన్ని రూపొందించినట్లు డిప్యూటీ C.M మరియు పంచాయతీరాజ్ మంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు వివరించారు. పల్లె పండుగలో భాగంగా గ్రామాల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమాలను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో చేపట్టాలని సూచించారు. పల్లె పండుగలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 3 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 500 కిలో మీటర్ల తారు రోడ్లు, వ్యవసాయ కుంటలు, పశువుల శాలలు, ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టనున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.