నారద వర్తమాన సమాచారం
ప్రకాశం జిల్లా…
జిల్లాలో భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండి, సహాయక చర్యలు అందించడానికి పోలీస్ బలగాలు, బృందాలు సర్వసన్నద్ధం.
నదులు, వాగులు, వంకలు, చెరువుల్లో ఈత కొట్టేందుకు వెళ్లడం ప్రమాదకరం…దయచేసి ఎవ్వరూ ప్రమాదం కొనితెచ్చుకోవద్దు..
ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్…
రానున్న 48 గంటలలో భారీ వర్ష సూచన నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని, ప్రత్యేక బలగాలతో బందోబస్తు మరియు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అన్నారు. చెరువులు, కుంటలు నిండి,లోతట్టు ప్రాంతాలు, గండి పడే అవకాశాలపై ముందస్తుగా క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలని, ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు సహాయక చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, సీఐలు, ఎస్సైలు సిబ్బందితో 18 టీములు ఏర్పాటు చేసినట్లు, ప్రతి టీములో 20 మంది సిబ్బంది ప్రత్యేక శిక్షణ పొందిన పోలీస్ బలగాలు సహాయక చర్యల నిమిత్తం సిద్ధంగా ఉన్నారు. సహాయక చర్యల్లో పాల్గొనే బృందాలకు అవసరమైన లైటింగ్ సామాగ్రి, లైఫ్ జాకెట్లు, సహాయచర్యలు నిమిత్తం తాళ్లు, బ్యాటన్లు, జేసీబీ మొదలగు సామగ్రి సంసిద్ధంగా ఉంచారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.