Saturday, November 23, 2024

ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల,ఎమ్మెల్సీ – 2025 ఎన్నికల ఓటు నమోదుపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు,ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్

నారద వర్తమాన సమాచారం

పిడుగురాళ్ల  :-

పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల పట్టణం లోని ఫేమస్ ఫంక్షన్ హాల్ నందు ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల (గ్రాడ్యుయేట్స్) ఎమ్మెల్సీ – 2025 ఎన్నికల ఓటు నమోదుపై అవగాహన కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మరియు ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల (గ్రాడ్యుయేట్స్) ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్  కృష్ణా-గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల (గ్రాడ్యుయేట్స్) మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఏ.ఎస్. రామకృష్ణ  ఎన్టీఆర్ యు ఆర్ విద్యా మిషన్ చైర్మన్ ఉప్పల రఘు బాబు  తెలుగుదేశం పార్టీ స్టేట్ లీడర్ పాములపాటి శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఓటు నమోదు ఎలా చేసుకోవాలని వివరించడం జరిగింది, పట్టభద్రులు (గ్రాడ్యుయేట్స్) అందరూ ఓటు నమోదు చేసుకుని ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల (గ్రాడ్యుయేట్స్) ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు కోరటం జరిగింది. అదేవిధంగా పార్టీ సభ్యత్వ నమోదు గురించి వివరించడం జరిగింది. రాష్ట్రంలో (2022-2024) సంవత్సరం సభ్యత్వం నమోదులో రెండో స్థానంలో ఉన్నామని, అదే స్ఫూర్తితో టీం వర్క్ పనిచేసి సభ్యత నమోదులో స్టేట్ మొదటి స్థానం సాధించాలని గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు చెప్పటం జరిగింది.

ఈ కార్యక్రమంలో గురజాల నియోజకవర్గంలోని తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీలలోని రాష్ట్ర, పార్లమెంట్, నియోజకవర్గం, మండల, గ్రామ, వార్డు స్థాయిల్లో వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు, మండల కన్వీనర్లు, క్లస్టర్ ఇంచార్జ్ లు, యూనిట్ ఇంచార్జ్ లు, ఐటీడీపి కో ఆర్డినేటర్లు, పట్టభద్రులు (గ్రాడ్యుయేట్స్) మరియు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత, మహిళలు పాల్గొనడం జరిగింది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading