నారద వర్తమాన సమాచారం
1955 నిబంధన పౌరసత్వ చట్టాన్ని సమర్ధించిన సుప్రీంకోర్టు
బంగ్లాదేశ్ యుద్ధ సమయములో అస్సాంలోకి వలస వచ్చిన హిందువులు భారత పౌరసత్వం కొరకు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతిచ్చే పౌరసత్వ చట్టం 1955 లోని కీలక నిబంధన సెక్షన్ 6A చెల్లుబాటును సర్వోన్నంత న్యాయస్థానం ఈరోజు సమర్ధించింది,
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్ర చూడ్, జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మా సనం 4:1 మెజారిటీతో తీర్పును వెలువరించింది.
ఐదుగురు న్యాయమూర్తు ల ధర్మాసనంలో జస్టిస్ పార్థీవాలా మాత్రమే రాజ్యాంగవిరుద్దమని భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. అక్రమ వలసలకు అస్సాం అకార్డ్ ఓ రాజకీయ పరిష్కారం.అదే సమయం లో సెక్షన్ 6 అనేది చట్టబద్దమైన మార్గం.
ఈ నిబంధనలు రూపొం దించడానికి మెజారిటీతో కూడిన పార్లమెంట్ కు శక్తి ఉంది.స్థానికుల ప్రయోజనాలకు కాపాడే సమతౌల్యత ఈ సెక్షన్ కు ఉంది. ఇక దీనిలోని కటాఫ్ డేట్ గా నిర్ణయించిన 1971 మార్చి 25 అనేది సరైంది.
పౌరసత్వచట్టం 1955 సెక్షన్ 6 ఎ ప్రకారం 1966 జనవరి నుంచి 1971 మార్చి 25 లోపు అస్సాంకు వచ్చిన వలసదారులు పౌరసత్వం కోరవచ్చు. ఈ నిబంధనను 1985లో అస్సాం అకార్డ్ తర్వాత తీసుకువచ్చారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.