నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయం,
నరసరావుపేట
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, ఐపీఎస్
ఈ స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక, ఆస్తి తగాదాలు మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 43 ఫిర్యాదులు అందాయి.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు.
పిడుగురాళ్ల పట్టణం అడితి సెంటర్ కు చెందిన వహబ్ కుమారుడు అయిన వసీమ్ అక్రమ్ మరియు కోడలికి మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకొనుటకు ప్రభుత్వ ఖ్వాజి అయిన షేక్ రిజ్వాన్ ద్వారా డైవర్స్ సర్టిఫికెట్ పొందినట్లు అయితే సదరు సర్టిఫికెట్ ఇవ్వడం కొరకు లక్ష ఇరవై వేల రూపాయలు ప్రభుత్వ ఖాజీ అయిన రిజ్వాన్ తీసుకొని నకిలీ విడాకుల సర్టిఫికెట్ ఇచ్చినట్లు అందుకుగాను వారిని నమ్మించి మోసం చేసిన ప్రభుత్వ ఖాజీ పై చర్య తీసుకొన వలసిందిగా ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
నరసరావుపేట శ్రీనివాస నగర్ కు చెందిన షేక్ సైదా, అతని చెల్లెలు అయిన షేక్ షంషాద్, షేక్ మహబూబ్ బాషా మరియు శ్రీలక్ష్మి అనే వారి వద్ద తుళ్లూరు నారయ్య అను వ్యక్తి పరిచయమై వారి పిల్లలకు కాంట్రాక్ట్ బేసిక్ పై గాని, పర్మినెంట్ ఉద్యోగాలు కానీ ఇప్పిస్తానని నమ్మ పలికి సుమారు 20 లక్షల రూపాయలు తీసుకొని ఎలాంటి ఉద్యోగాలు కానీ, సమాధానం కానీ చెప్పుటలేదు. నలుగురు ఫిర్యాదులు డబ్బులు తీసుకునిన తుళ్లూరు నారయ్య నివాసం వద్దకు వెళ్లి డబ్బులు అడగగా మీపై ఎస్సీ ఎస్టీ కేసు పెడతానని బెదిరించినట్లు అందుకుగాను వారికి న్యాయం చేయవలసిందిగా ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
క్రోసూరు మండలం నాగవరం గ్రామానికి చెందిన తన్నీరు తాతారావు మరియు ఆవుల శ్రీను అను ఇద్దరు కలిసి తన గ్రామంలోని సచివాలయం కట్టడానికి ఒప్పుకున్నట్లు అందులో భాగంగా 500 సిమెంట్ బస్తాలను తెప్పించగా అందులోని 200 సిమెంట్ బస్తాలు పోయినప్పటికీ సదరు బస్తాల డబ్బులు కావాలని ఆవుల శ్రీను ఫిర్యాదు ని మరియు అతని కుటుంబాన్ని హింసిస్తున్న విషయమై ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
దాచేపల్లి గ్రామానికి చెందిన లంకె అజయ్ కుమార్ కొద్ది నెలలుగా ట్రేడింగ్ యాప్ ద్వారా విడుదల ద్వారా ఐదు లక్షల అరవై నాలుగు వేల రూపాయలను పెట్టుబడులు పెట్టినట్లు మొదట ఎక్కువ లాభం వచ్చినట్లుగా చూపగా డబ్బులు విత్ డ్రా చేసుకుందామని చూడగా అలా చేయాలంటే అదనంగా రెండు లక్షలు కట్టాలని డిమాండ్ చేసినారు అనుమానం వచ్చిన ఫిర్యాదు సైబర్ క్రైమ్ వారికి ఫిర్యాదు చేయగా అకౌంట్ లో డబ్బులు హోల్డ్ లో పెట్టినట్లు కావున ఫిర్యాది మోసపోయానని తెలుసుకొని ఎస్పీ ని కలిసి న్యాయం చేయవలసింది గా అర్జీ ఇవ్వడమైనది.
మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన షేక్ గుంటూరు రసూలుల్లా, వెన్న పేరు రెడ్డి మరియు వేమవరం గ్రామానికి చెందిన రవీంద్ర అను వారు వజ్రాలు శుద్ధి చేయుటకు డబ్బులు కావాలని పెట్టుబడి పెడితే రెండింతలు డబ్బులు ఇస్తామని నమ్మబలికి పిన్నెల్లి గ్రామానికి చెందిన ఉషా నాయక్, షేక్ తాలిబ్ వారు ఫిర్యాదుల వద్ద నుండి 25 లక్షల రూపాయలు తీసుకొని, తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఫిర్యాదులను ఇబ్బంది పెడుతున్నట్లు ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
చిలకలూరిపేట పట్టణానికి చెందిన మాఖం సందీప్ తన పెద్దమ్మ ఆయన బిందు మాధవి కి పిల్లలు లేనందున తన పెద్దమ్మ బాగోగులు తీసుకున్నందుకు గాను చిలకలూరిపేట పట్టణంలో గల మూడు సెంట్లు ఖాళీ స్థలమును తన పేరున వీలునామా రాయడం జరిగింది. అయితే చెరుకుపల్లి రామ్మోహన్ రావు రెండవ కుమారుడు అయిన చెరుకుపల్లి సృజన్ దేవ్ తప్పుడు డాక్యుమెంట్లతో సృజన దేవ్ భార్య మాధురి తమ్ముడు కనకం శ్రీనివాస్ కు విక్రయించినట్లు కావున తనకు న్యాయం చేయవలసింది గా ఫిర్యాది ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వారి ఫిర్యాదులను రాసిపెట్టడంలో పోలీస్ సిబ్బంది సహాయ సహకారాలు అందించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.