నారద వర్తమాన సమాచారం
పల్నాడు
ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ & రిపోర్టర్స్ యూనియన్ పల్నాడు జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం
ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ పల్నాడు జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని ఎల్.బి.మార్కెట్ వద్ద గల పిల్లి నాగన్న సత్రం లోని ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చొప్పురపు సాంబశివ నాయుడు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పంగులూరి బుచ్చిబాబు పాల్గొని పల్నాడు జిల్లా నూతన కమిటీ ఏర్పాటు చేసారు. పల్నాడు జిల్లా అధ్యక్షులుగా పిల్లి యజ్ఞనారాయణ, గౌరవ అధ్యక్షులుగా ఆత్మకూరి కృష్ణ ప్రసాదరావు, పగడాల నాగేశ్వర రావు, జనరల్ సెక్రటరీగా పొన్నెకంటి శ్రీనివాసాచారి, ట్రెజరర్ గా నాగేండ్ల వెంకటేశ్వర్లు, వైస్ ప్రెసిడెంట్ లుగా వాసిమల్లి లక్ష్మణరావు, బెల్లంకొండ నాగసాయి ప్రసాద్, జాయింట్ సెక్రటరీలుగా రమావత్తు వెంకటేశ్వర్లు నాయక్, జక్కుల కృష్ణ, ఈసీ మెంబర్లుగా ములుగూరి అశోక్ కుమార్, రామ గణేష్ నియమితులయ్యారు. సభ్యులందరినీ హాజరైన ఎడిటర్లు మరియు రిపోర్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కమిటీ సభ్యులు అందరికి ఐడి కార్డులు, నియామక పత్రాలు రాష్ట్ర అధ్యక్షులు చొప్పరపు సాంబశివ నాయుడు స్వయంగా తన చేతులు మీదుగా అందజేశారు. తదుపరి వారందరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్బంగా సాంబశివ నాయుడు మాట్లాడుతూ ఎడిటర్లు, రిపోర్టర్లు ఎన్నో సమస్యలు ఎదుర్కొటున్నారని, గత ప్రభుత్వ హయాంలో అక్రిడేషన్ల కోసం రెండు రోజులు నిరాహార దీక్ష చేసిన తదుపరి మాత్రమే అక్రిడేషన్ లు ఇచ్చారని, జర్నలిస్టు సమస్యలపై పోరాడేందుకు ఎవరిదగ్గరకైనా, ఎంతదూరమైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. వారి సమస్య పరిష్కరించెందుకు మన యూనియన్ కృషి చేస్తుందన్నారు. ఎడిటర్స్, రిపోర్టర్స్ కి ప్రభుత్వం గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు. ఇవ్వని నేపథ్యంలో నిరాహార దీక్షలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సమావేశంలో గుంటూరు జిల్లా కమిటిని కూడా నియామకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా నుండి షేక్ జిలాని మాలిక్, షేక్ గౌస్, అనిల్, శ్రీనివాసరావు మరియు ఇతర ఎడిటర్లు, రిపోర్టర్లు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.