Thursday, November 21, 2024

పల్నాడు జిల్లాలో పోలీసు అమర వీరుల వారోత్సవాలు విజయవంతం చేయండి ఎస్పీ  కంచి శ్రీనివాసరావు ఐ.పి.యస్….

నారద  వర్తమాన సమాచారం

పల్నాడు జిల్లా

జిల్లాలో పోలీసు అమర వీరుల వారోత్సవాలు విజయవంతం చేయండి ఎస్పీ  కంచి శ్రీనివాసరావు ఐ.పి.యస్….

పల్నాడు జిల్లాలో ఈనెల 21 నుండీ 31 వ తేదీ వరకు పోలీసు అమర వీరుల వారోత్సవాలను
ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైన పల్నాడు జిల్లా పోలీసుశాఖ.

ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్. ప్రతీ ఏటా పోలీసు అమరులను స్మరించుకుంటూ నిర్వహించే పోలీసు అమర వీరుల వారోత్సవాలు ఈనెల 21 నుండీ 31 వరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పల్నాడు జిల్లా ఎస్పీకంచి శ్రీనివాస రావు  తెలిపారు.

ఈనెల 21 నుండి పోలీస్ అమరవీరుల వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అమరులైన పోలీసులను స్మరించుకుంటూ వారి సేవలను కొనియాడుతూ ఈ వారోత్సవాలను ఘనంగా నిర్వహించేలా జిల్లా పోలీసుశాఖ సిద్ధమయ్యింది. జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్ పర్యవేక్షణలో ఈనెల 21 వ తేదీ నుండీ 31 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ల పరిధుల్లో ఈ వారోత్సవాలు నిర్వహించనున్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన అమర పోలీసుల్ని గుర్తు చేసుకోవడంతో పాటు సమాజంలో కీలకమైన పోలీసుల పాత్ర, విధులు, త్యాగాలు గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడమే ముఖ్య ఉద్ధేశ్యం.

1959వ సంవత్సరం, అక్టోబర్ 21వ తేదీన దేశ భద్రత కోసం పదిమంది సీఆర్‌పీఎఫ్ జవాన్‌లు భారత్, చైనా సరిహద్దుల్లో ఉన్న లడక్ ఆక్సాయ్‌చిన్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. భారీ సంఖ్యలో చైనా సైనికులు భారత్ సరిహద్దుల్లోకి చొరబడి ఒక్కసారిగా మన సీఆర్‌పీఎఫ్ జవాన్‌లపై విరుచుకుపడ్డారు. సంఖ్యా బలం తక్కువుగా ఉన్నప్పటికీ భారత్ జవాన్‌లు ఆత్మస్థెర్యంతో చైనా సైనికులను ఎదురిస్తూ, చివరి రక్తం బొట్టు వరకు పోరాడారు. దేశం కోసం అసువులు బాశారు. ఈ ఘటన పురస్కరించుకుని ప్రతీ ఏటా అక్టోబర్ 21వ తేదీ పోలీసుల అమర వీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నారు.

జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి…

ఈనెల 21న అమరవీరుల సంస్మరణ దినం… స్మృతి పరేడ్, పోలీసు అమరులకు నివాళులు, శ్రద్ధాంజలి స్థానిక కోడెల శివప్రసాద్ స్టేడియం నందు జరగనున్నది.

ఈనెల 21 న స్థానిక పోలీసు అమర వీరుల స్థూపం వద్ద జిల్లా ఎస్పీ ఐపీఎస్ ఆధ్వర్యంలో పోలీసు అమర వీరుల సంస్మరణ దినం నిర్వహించనున్నారు.

దేశ వ్యాప్తంగా… మావోయిస్టులు, ఉగ్రవాదులు, తదితర అసాంఘిక శక్తులతో పాటు విధి నిర్వహణలో భాగంగా అల్లర్లు, అలజడుల్లో కీలక విధులు నిర్వర్తించి ప్రాణాలు అర్పించిన పోలీసు సిబ్బందిని స్మరించుకుంటూ నివాళులు అర్పించనున్నారు. స్మృతి పరేడ్ నిర్వహించి అమరులకు శ్రద్ధాంజలి ఘటించనున్నారు.

ఈనెల 22 నుండి 30 వరకు పోలీసు అమరుల గ్రామాల సందర్శన… అమరుల సేవలను వివరించడం జరుగుతుంది.
22.10.2024 వ తేదీ నుండి 30.10.2024 వ తేదీ వరకు పోలీసు ప్రేరణ చిత్రాలు ఆయా పోలీసు స్టేషన్ పరిధిలో ప్రదర్శించబడతాయి.

ఈనెల 24.10.2024వ తేదీ నుండి 27.10.2024 వ తేదీ వరకు చర్చావేదికలు, వక్తృత్వపు పోటీలు నిర్వహించనున్నారు.

జిల్లాలోని పాఠశాలల విద్యార్థులకు ” కళాశాల విద్యార్థులకు, సైబర్ క్రైమ్ నియంత్రణలో యువత యొక్క పాత్ర టాపిక్ పై, మరియు పోలీసు సిబ్బందికి ” మరియు పోలీస్ పిల్లలకు జిల్లా పోలీస్ కార్యాలయంలో పర్యావరణ పరిరక్షణలో పోలీసులు యొక్క చర్య అనే అంశాలపై చర్చావేదికలు, వక్తృత్వపు పోటీలు నిర్వహించనున్నారు.

ఈ నెల 25.10.2024వ తేదీన నుండి 29.10.2024 వ తేదీ వరకు జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ తో పాటు సబ్ డివిజన్ కార్యాలయాలు, పోలీసు స్టేషన్ ల స్థాయిలో ఓపెన్ హౌస్, రక్త దానాలు లు,వైద్య శిబిరాలు నిర్వహించి సామాజిక సేవను చాటనున్నారు. నిర్వహించనున్నారు.
ఓపెన్ హౌస్ నందు పోలీసులు నిత్యం వినియోగించే ఆయుధాలు, సాధనాలు, పరికరాలను ప్రదర్శించి విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. పోలీసు స్టేషన్ల రికార్డుల నిర్వహణ గురించి తెలియజేయనున్నారు

ప్రదర్శనలో ఉంచే ఆయుధాలు, పరికరాలు, సాధనాలు సేవాదళ్ డ్రస్ , ఫైబర్ లాఠీ, బాడీ ప్రొటెక్టర్ , స్టోన్ గార్డు, హెల్మెట్ , కేన్ లాఠీ, బుల్లెట్ ప్రూప్ జాకెట్ హెవీ, మీడియం, లైట్ ... డే మరియు నైట్ విజన్ బైనాక్యూలర్లు, జి.పి.ఎస్ , మెగాఫోన్ , లెటర్ బాంబు డిటెక్టర్ , ప్యాకెట్ స్కానర్ , డి.ఎస్ .ఎం.డి, HHMD, NLJD, నార్కో డిటెక్సన్ కిట్ , పాలిరే యు.వి.లైట్ , క్లూస్ టీం, డస్ట్ ఫుట్ ప్రింట్ లిఫ్టర్ , LHMS, బాడీవోన్ కెమేరాలు, ఫిన్స్ ( ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ నెట్ వర్కింగ్ సిస్టం) , డ్రోన్ కెమేరాలు, డి.ఎఫ్ .ఐ.డి కు సంబంధించిన పోలీసు... మైన్ ప్రూఫ్ , వజ్ర, వాటర్ కేనన్ వాహనాలను ప్రదర్శనలో ఉంచనున్నారు. పోలీసుల దర్యాప్తుల్లో కీలక భూమిక పోషించే డాగ్స్ బృందం విన్యాసాలు ప్రదర్శించనున్నారు.

ఈనెల 30.10.2024 వ తేదీన సెమినార్లు/ ఉపన్యాసాలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా సమాజం కోసం పోలీసులు చేస్తున్న సేవలు, విధులు, త్యాగాలు గురించి నాటికలు మరియు పాటల రూపంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు.

ఈనెల 31.10.2024 వ తేదీన సమైక్యతా దినం
సమైక్యత భావాన్ని చాటుతూ ప్రజల సహకారంతో ఈనెల 31 న జిల్లా వ్యాప్తంగా సమైక్యతా దినం పాటించనున్నారు.

ఈనెల 31 వ తేదీన ఉదయం యూనిట్ రన్, సాయంత్రం క్యాండిల్ ర్యాలీతో పోలీసు అమర వీరుల వారోత్సవాలు ముగియనున్నాయి.

పల్నాడు… జిల్లా పోలీసు కార్యాలయం,


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading