Friday, July 11, 2025

పురుగు మందుల డీలర్లకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించిన దాచేపల్లి మండల వ్యవసాయ అధికారి డి.పాప కుమారి

నారద వర్తమాన సమాచారం

తేదీ. 21.10. 2024 న దాచేపల్లి మండల వ్యవసాయ అధికారి డి.పాప కుమారి వారు మండలంలోని విత్తనాలు, ఎరువులు మరియు పురుగు మందుల డీలర్లకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

అదేవిధంగా మండలంలోని పురుగుమందులు మరియు ఎరువుల దుకాణాలను తనిఖీ చేయడం కూడా జరిగింది.

ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల ఏ డి ఏ వారు పాల్గొని వారు మాట్లాడుతూ డీలర్లు అందరూ స్టాక్ రిజిస్టర్కు Form N ను, బిల్లు పుస్తకాలకు Form M లను మాత్రమే ఉపయోగించవలనని, Form O లను తమ లైసెన్సు లలో నమోదు చేయించుకోవాలని, అమ్మకపు బిల్లులపై రైతుల సంతకాలు తీసుకోవాలని, డీలర్లు అందరూ తమ లైసెన్స్ లు గడువు ముగిసేలోపే రెన్యువల్ చేయించుకోవాలని, గడువు దాటిన పురుగుమందులను విడిగా నిలువ చేసి ఆ వివరాలను రిజిస్టర్ ఆఫ్ డేట్ ఎక్స్పైర్ పెస్టిసైడ్స్ రిజిస్టర్ నందు నమోదు చేయాలని సంబధిత పురుగుమందుల తనిఖీ అధికారి వారికి తెలియజేయాలని,

అదేవిధంగా MRP కన్నా ఎక్కువ ధరకు వేటిని అమ్మరాదని, ఇలా అమ్మినచో వారిపై చర్యలు తీసుకుంటామని,

ఈ ఎరువులు, పురుగుమందులు అన్నింటిని సోర్స్ ఆఫ్ సర్టిఫికెట్లు, ప్రిన్సిపల్ సర్టిఫికెట్లు, ఇన్వాయిసులు అన్ని ఉన్న వాటిని మాత్రమే కొనుగోలు చేసి, అమ్మాలని తెలియజేశారు.

అదేవిధంగా ప్రతి ఒక్క డీలర్ కూడా ఈ విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల చట్టాల గురించి పూర్తిగా తెలుసుకొని ఉండాలని కూడా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల ఏ డి ఏ బి. శ్రీకృష్ణదేవరాయలు వారు, దాచేపల్లి మండల వ్యవసాయ అధికారి డి.పాప కుమారి వారు, మండలంలోని పురుగుమందులు, ఎరువులు డీలర్లు అందరూ పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading