నారద వర్తమాన సమాచారం
అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా రాజకీయ ప్రక్షాళన కు యువత నడుంకట్టాలి
ఎన్నికలలో ధన ప్రభావం పెరుగుతున్నది
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన
డా శివాజీ ఇంట పిచ్చాపాటి
గుంటూరు,
ఎన్నికలలో ధన ప్రభావం నానాటికీ పెరిగిపోతున్నదని….ఎమ్మెల్యే అభ్యర్థి కనీసం రూ.30 కోట్లు ఖర్చు చేయాల్సివస్తున్నదని మంచి వారు కూడా దీనికి అతీతులు కారని, అందుకే యువత రాజకీయాల్లోకి దిగి అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా రాజకీయ ప్రక్షాళన చేయాలంటూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. తాను పోటీ చేసిన ఎన్నికలలో రూ 10 లు కూడా ఖర్చు చేయలేదని, ప్రజల విరాళాలతో రూ 60 వేలకు మించి ఖర్చు అయ్యేది కాదన్నారు.
ఎమర్జన్సీ, జై ఆంధ్ర పలు రైతాంగ ప్రజా ఉద్యమాలలో కలసి పనిచేసిన చిరకాల మిత్రుడు మాజీ రాజ్యసభ సభ్యులు డా.యలమంచలి శివాజీ నివాస గృహానికి వెళ్లి గంట సేపు పైగా ఎంతో ఉల్లాసంగా వివిధ అంశాల పై పిచ్చాపాటి మాట్లాడారు. తొలుత డా.శివాజీ స్వాగతం పలికి సత్కరించారు. ఆపై పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ పాలక వర్గ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డి మల్లిఖార్జునరావు, కార్యదర్శి పాటిబండ్ల విష్ణువర్థన్, సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు తదితరులు సత్కరించి అభినందించారు.
వెంకయ్యనాయుడు మీడియా తో మాట్లాడుతూ ప్రచార ప్రసార సాధ్యాలు ప్రజా సంక్షేమమే పరమావధిగా నిష్పక్షపాతంగా స్వేచ్ఛ తో వ్యవహరించాల్సి ఉండగా క్రమేణ అసత్యాలు, అపోహలు, సంచలనకు ప్రాధాన్యతనివ్వడం బాధాకరమన్నారు. దీనికి తోడు తాజాగా రాజకీయ నాయకులు, స్వార్థపరులు ఈ రంగం లోకి ప్రవేశించి తమ ఎజెండా కు ప్రాధాన్యతనిస్తున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియా ప్రజలకు ఎంతో చేరువవుతున్నదని అన్నారు.
సిద్ధాంత రాజకీయాల్లో కొనసాగినం వారు ఎన్నటికీ మంచి వారుగా కీర్తించబడతారనటానికి డా.శివాజీ ఉదాహరణ అని నాయుడు అన్నారు.
గ్రామ వికాసం, అభ్యుదయం , పట్టణాల అభివృద్ధికి మరింత పాటుబడాల్సి ఉందన్నారు.
ఈ కార్యక్రమం లో సంగం డైరీ మాజీ చైర్మన్ కిలారి రాజన్ బాబు, స్ధానిక పెద్దలు బొల్లేపల్లి సత్యనారాయణ, లంకా సూర్యనారాయణ, దాసరి హనుమంతరావు, జొన్నలగడ్డ రామారావు, అత్తోట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.