నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్…
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం – 2024 సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు ది.23.10.2024 వ తేదీన పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఓపెన్ హౌస్ – Open House( పోలీసులు విధి నిర్వహణలో శాంతి భద్రతల పరిరక్షణ కొరకు ఉపయోగించే సాధనాల ప్రదర్శన) కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది.
పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్ ఈ ఓపెన్ హౌస్ – Open House కార్యక్రమాన్ని ప్రారంభించినారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
శాంతి భద్రతల పరిరక్షణ,నేర నియంత్రణ మరియు నేర దర్యాఫ్తులో ఉపయోగించే ఆయుధాలు,సాంకేతిక పరికరాల గురించి విద్యార్ధిని – విద్యార్ధులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం సంతోషకరమని తెలిపారు.
విద్యార్థిని – విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ గారు సూచించారు.
అసాంఘిక శక్తుల అణచివేతలో,శాంతి భద్రతల పరిరక్షణలో,నేర నియంత్రణ మరియు నేర దర్యాఫ్తులో పోలీస్ వారు తీసుకునే చర్యల గురించి వివరించడమే ఈ ఓపెన్ హౌజ్(Open House) కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అని ఎస్పీ తెలిపారు.
ఈ ఓపెన్ హౌస్(Open House) కార్యక్రమము నిర్వహించడం వలన సమాజ శ్రేయస్సు కొరకు పోలీస్ వారు నిర్వర్తించే విధులు గురించి విద్యార్థిని,విద్యార్థులకు అవగాహన ఏర్పడి,దీని ద్వారా ప్రేరణ పొంది,తద్వారా యువత పోలీస్ శాఖ మరియు ఇతర భారత బలగాల లో సేవలందించడానికి ముందుకు రావడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.
ఈ ఓపెన్ హౌస్(Open House) కార్యక్రమానికి హాజరుఅయిన విద్యార్ధులను ఉద్దేశించి పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ముఖ్యంగా కొన్ని సూచనలు చేశారు.
మహిళలను గౌరవించడం మన ధర్మం. భారతీయ సంస్కృతి. కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్స్ నందు మహిళలకు సంబంధించి ఇబ్బందికర వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు. వాటిని మీరు గమనించకూడదు.
పాఠశాలలో మీరు చదువుకొనే పాఠ్యాంశాలు రేపటి రోజున మిమ్ములను భావి పౌరులుగా తీర్చిదిద్దే విధంగా ఏర్పాటు చేయబడ్డాయి.
అంతేకానీ చెడు అలవాట్లకు అలవాటు పడిన వారు గా౦జా త్రాగుదాం అని కానీ,డ్రగ్స్ తీసుకుందా మని కానీ,ఆడ పిల్లలను ఏడిపించాలని అన్నా కూడా ఆ ప్రేరణాలకు మీరు ప్రేరేపించకూడదు.
వృద్దులు ఎవరయినా కనబడితే చేయుతనివ్వాలి.
పోలీసు జాగీలాలు విధి నిర్వహణలో భాగంగా ప్రేలుడు పదార్ధాలను వాసన చేస్తే జాగిలం తాలూకు ఊపిరితిత్తులు పాడవుతాయి. దాని జీవిత కాలం 6 నుండి 7 సంవత్సరాలు. అలాంటి జాగీలాలే మీ నుండి ఏమి ఆశించకుండా ఆ జాగీలాలు మీ రక్షణలో భాగ్యమైనపుడు మనుషులమైన మనం ఖచ్చితంగా మంచి ప్రవర్తనను కలిగి ఉండాలి.
భావిపౌరులు అయిన మీరు అవతలి వ్యక్తి స్వేచ్చను హరించే విధంగా ప్రవర్తించకూడదు.
ట్రాఫిక్ రూల్స్ పాటించడం నేర్చుకోవాలి. తప్పనిసరిగా హెల్మెట్ వాడాలి. వేగం అనేది ప్రాణాలను హరిస్తుంది కావున మీ ప్రాణం గురించి పూర్తి బాధ్యతను తీసుకుంటూ ఇతరుల ప్రాణాలకు ఎటువంటి హాని కలిగించరాదు.
అనవసరమైన అలవాట్లను,శాంతి భద్రతలను విఘాతం కలిగించే వాటిలో పాల్గొని మీరు ఇబ్బంది పడకూడదు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎటువంటి ఇబ్బంది కలిగించి బాధపెట్టకూడదు.
వివిధ పాఠశాలలు మరియు కళాశాలల నుండి ఓపెన్ హౌస్(Open House) కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థిని, విద్యార్థులకు వివిధ ఆయుధాలు మరియు సాంకేతిక పరికరాల వివరాలు,వాటి పనితీరు మరియు వాటి ఉపయోగాలు గురించి ఏఆర్ డిఎస్పీ జి.మహాత్మా గాంధీ ,వెల్ఫేర్ ఆరై యల్. గోపినాథ్,ANS RI యువరాజ్ , MT RI కృష్ణ ,అడ్మిన్ RI యం.రాజా వివరించారు.
తదనంతరం పోలీస్ శాఖలో నేర దర్యాఫ్తులో ప్రముఖ పాత్ర పోషించే జగిలాల ప్రదర్శనను చూపించారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ కంచి శ్రీనివాస రావుతో పాటు జిల్లా అదనపు ఎస్పీ జె. వి. సంతోష్(పరిపాలన ) ,ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.