నారద వర్తమాన సమాచారం
దాచేపల్లి పట్టణం లో డయేరియా(అతిసారం) ప్రభావిత ప్రాంతాలను సందర్శించి న కలెక్టర్ పి.అరుణ్ బాబు,ఎస్.పి కే శ్రీనివాసరావు , ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు డిఎం. హెచ్. ఓ. బి రవి ఆర్డిఓ మురళి కృష్ణ
దాచేపల్లి :-
పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, దాచేపల్లి టౌన్ 12వ వార్డు, నారాయణపురంలోని, అంజనాపురం కాలనీ నందు డయేరియా(అతిసారం) ప్రభావిత ప్రాంతాలను పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు పల్నాడు జిల్లా ఎస్.పి కే శ్రీనివాసరావు , గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు డిఎం. హెచ్. ఓ. బి రవి ఆర్డిఓ మురళి కృష్ణ దాచేపల్లి మున్సిపల్ కమీషనర్ ఎంవీ అప్పారావు దాచేపల్లి తాహసిల్దార్ కుటుంబ రావు , మున్సిపల్ సిబ్బంది, మరియు సంబంధిత అధికారులు పర్యటించి డయేరియా (అతిసార)తో ఈరోజు మృతిచెందిన కీ”శే” బండారు చినవీరయ్య భౌతికకాయానికి మరియు కీ “శే “తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు (తమ్మిశెట్టి కృష్ణారావు కుమారుడు) కి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, డయేరియా (అంతిసారం) ప్రభావిత ప్రాంతాలలోని సైడ్ డ్రైనేజీలను, తాగు నీటి పంపులను, పైపు లైన్లను పరిశీలించటం జరిగింది. అనంతరం గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, డయేరియా ( అతిసారం) ప్రభావిత కాలనీకి రూ.25 లక్షల రూపాయలతో వాటర్ ఫిల్టర్ బెడ్లు మరియు పైపులైన్లు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం డయేరియా(అంతిసారం) ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి, ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభావిత ప్రాంతాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేయటం జరిగింది. అనంతరం నారాయణపురం రైల్వే స్టేషన్ రోడ్డులోని కృష్ణ హాస్పిటల్ నందు డయేరియా భారినపడి చికిత్స పొందుతున్న బాధితులను, పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు పరామర్శించడం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.