నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్…
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం – 2024 సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు ది.24.10.2024 వ తేదీన పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో మెడికల్ క్యాంపు (వైద్య శిబిరాన్ని) ఏర్పాటు చేయడం జరిగింది.
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్ ఈ మెడికల్ క్యాంప్(వైద్య శిబిరం) ప్రారంభించినారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
శాంతి భద్రతల పరిరక్షణ,నేర నియంత్రణ లో భాగంగా పోలీసులు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉంటారు. దానిని దృష్టిలో పెట్టుకొని ఈ మెడికల్ క్యాంపు (వైద్య శిబిరం) కార్యక్రమాన్ని తలపెట్టడం సంతోషకరమని తెలిపారు.
ఈ అవకాశాన్ని పోలీస్ సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు.
మెడికల్ క్యాంపు (వైద్య శిబిరం) ఏర్పాటు సందర్భంగా పోలీసు సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.
ఈరోజు నిర్వహించిన మెడికల్ క్యాంపు నందు నిర్వహిస్తున్న వైద్య పరీక్షలలో ముఖ్యంగా కంటికి సంబంధించిన, గుండెకు సంబంధించిన మరియు ఎముకలకు సంబంధించిన వైద్య పరీక్షలు జరుపుతూ న్నట్లు తెలిపారు.
ఈ మెడికల్ క్యాంపు వైద్య శిబిరానికి సంబంధించి మ్యాక్స్ విజన్ డాక్టర్ చెంచి రెడ్డి రాఘవేంద్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ అనిరుద్ ఫణి భార్గవ్ తో మరియు శ్రీ దత్త సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ కృష్ణ కాంత్ , పి.మహేష్ తో ముఖ్యంగా పోలీసు సిబ్బంది యొక్క వైద్యమునకు సంబంధించి చర్చించడం జరిగింది.
పైన తెలిపిన హాస్పిటల్స్ కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ దగ్గర్లో ఉన్న పోలీస్ సిబ్బంది హాస్పిటల్స్ కు వెళ్లి అక్కడ వైద్య పరీక్షలు చేయించుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పోలీసు శాఖలో పల్నాడు జిల్లా నందు 50 సంవత్సరాలు దాటిన పోలీసు సిబ్బందికి ప్రత్యేకంగా శ్రద్ధ
తీసుకొని గుండెకు సంబంధించిన అన్ని వైద్య పరీక్షలు నిర్వహించడానికి మరియు ఉమెన్ సిబ్బందికి క్యాన్సర్ సంబంధిత పరీక్షలు స్త్రీ వైద్య నిపుణులతో చేయించుకొనే విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమం ఈ ఒక్క రోజుతో కాకుండా జిల్లాలోని పోలీసు సిబ్బందికి జిల్లా పోలీసు ఆఫీసు నందు పనిచేస్తున్న హోంగార్డ్స్ కు, పోలీసు అధికారులకు, సిబ్బంది కి ఈ వైద్య పరీక్షలు పూర్తి అయ్యేంతవరకు వీటిని కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
పైన తెలిపిన వైద్య పరీక్షలకు సంబంధించి ఏమైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఉత్పన్నమైతే వాటికి సంబంధించి ఏ ఏ హాస్పిటల్ వారిని సంప్రదించాలి ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనేది వైద్య పరీక్షల రిపోర్టులు వచ్చిన తర్వాత దానిని బేస్ చేసుకుని నిర్ణయం తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ కంచి శ్రీనివాస రావు తో పాటు జిల్లా అదనపు ఎస్పీ జె. వి. సంతోష్(పరిపాలన ) ఏఆర్ డిఎస్పీ జి.మహాత్మా గాంధీ వెల్ఫేర్ RI యల్.గోపినాథ్ ANS RI యువరాజ్ MT RI కృష్ణ అడ్మిన్ RI యం.రాజా ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.