నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా…
ఈరోజు కలెక్టర్ ఆఫీస్ నందు జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు బాణసంచా విక్రేతదారులకు నియమ నిబంధనలు గురించి తెలపడం జరిగింది.
అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా టపాసులు నిల్వ ఉంచినా, విక్రయించినా చర్యలు తప్పవు
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి.శ్రీనివాస రావు ఐపియస్
బాణసంచా విక్రయదారులు చట్టం సూచించిన నిబంధనలు, జాగ్రత్తలు పాటించాలి.
దీపావళి పర్వదినాన టపాసులు కాల్చేటప్పుడు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి.
జిల్లాలో టపాసులు ఎక్కడైనా అక్రమంగా విక్రయిస్తున్నా, నిల్వ ఉంచినా స్ధానిక పోలీసు స్టేషన్ లో గాని,ఎస్పీ కి గాని సమాచారం అందించాలి.
పల్నాడు జిల్లాలో ప్రభుత్వ అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా టపాసులు నిల్వ ఉంచినా, విక్రయించినా అటువంటి వారి పై ప్రేలుడు పదార్థాల చట్టం, ఐపిసి సెక్షన్స్ ప్రకారం చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపియస్ శుక్రవారం రోజున కలెక్టర్ ఆఫీసు నందు జరిగిన సమావేశంలో తెలిపారు.
ప్రమాదాలకు తావులేకుండా, సరైన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ విక్రయించాలని విక్రయదారులకు జిల్లా ఎస్పీ పలు సూచనలు చేశారు.
సూచించిన బహిరంగ ప్రదేశాలలో నిర్ణీత కొలతల మేరకు ప్రత్యేక షెడ్డులలో దుకాణాలు ఏర్పాటు చేసుకోని నిబంధనలు పక్కాగా పాటించాలన్నారు.
నీరు, ఇసుక, తదితర అగ్నిమాపక నిరోధక సామాగ్రిని తప్పనిసరిగా టపాసుల విక్రయ దుకాణాల్లో సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
ఆ పరిసరాల్లో ఏమి చేయాలో… ఏమి చేయకూడదో తగు సూచనలు చేస్తూ బోర్డులను ప్రదర్శనలో ఉంచాలి.
చిన్న పిల్లలను బాణసంచా దుకాణాల్లో విక్రయాలకు ఉంచుకోరాదన్నారు.
లైసెన్స్ లు కల్గిన దుకాణదారులు మాత్రమే బాణసంచా విక్రయాలు చేయాలన్నారు.
నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
బాణ సంచాను అనుమతి లేకుండా నిల్వ ఉంచినా విక్రయాలు జరిపినా తయారుచేసినా వాటిని వినియోగించినా అటువంటి వారి పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు.
ఎక్కడైనా ప్రమాదం చోటు చేసుకున్నా, అక్రమంగా టపాసులు విక్రయిస్తున్నా వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్ కు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని జిల్లా ఎస్పీ కంచి.శ్రీనివాసరావు ఐపియస్ తెలిపారు.
జిల్లా పోలీస్ కార్యాలయం, పల్నాడు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.