నారద వర్తమాన సమాచారం
కేటీఆర్‌ను అడ్డుకున్న పోలీసుల భార్యలు.. అసెంబ్లీలో మాట్లాడుతానని హామీ
ఆదిలాబాద్ పోరుబాటకు వెళ్తో్న్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ను పోలీసుల భార్యలు అడ్డుకున్నారు.
తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్‌ను వేడుకున్నారు. అంశాన్ని అసెంబ్లీలో చర్చిస్తామని.. తప్పకుండా న్యాయం జరిగే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. పోలీసుల భార్యల ధర్నాతో నిజామాబాద్-కామారెడ్డి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కాగా, రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ ఉద్యమబాట చేపట్టిన విషయం తెలిసిందే. గురువారం ఆదిలాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించతలపెట్టారు. ఈ సభలో పాల్గొనేందుకు కేటీఆర్ ఆదిలాబాద్ వెళ్తుండగా పోలీసుల భార్యలు అడ్డుకున్నారు. బూటకపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి పాలనలో ఎవరూ సంతోషంగా లేరని కేటీఆర్ అన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.