నారద వర్తమాన సమాచారం
జే బ్రాండ్ల దోపిడీలో అంతా బహిరంగమే !
ఏపీలో జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంపై సీఐడీ అంతర్గత విచారణ దాదాపుగా పూర్తి చేస్తోంది. చాలా రోజుల కిందటే కేసు నమోదు చేసింది. సంచలనాలకు తావు లేకుండా మొత్తం స్కాం గుట్టు రట్టు చేసేందుకు కావాల్సిన ఆధారాలు, పత్రాలు అన్నీ వెలుగులోకి తెచ్చింది. తాజగా వైసీపీ నేతలు కబ్జా చేసిన డిస్టిలరీల్లో సోదాలు నిర్వహించింది. నిజానికి డీటైల్స్ మొత్తం ఇంతకు ముందే సేకరించారు. లాంఛనంగా ఆయా డిస్టిలరీల్లో సోదాలు నిర్వహించారు. ఆధారాలు సేకరించారు.
డిస్టిలరీలు కబ్జా !
జగన్ అధికారంలోకి వచ్చాక సొంత బ్రాండ్లు తెచ్చి అమ్మారు. వీటిని ఎక్కడి నుంచో తీసుకు రాలేదు. ప్రతి ఊళ్లో ఉన్న డిస్టిలరీలను కబ్జా చేశారు. యజమానుల్ని బెదిరించి లీజులకు తీసుకున్నారు. అందులో ఇష్టారీతిన జే బ్రాండ్లు ఉత్పత్తిచేశారు. ఎంత ఉత్పత్తి చేశారు.. ఎంత అమ్మారు అన్న లెక్కలే లేవు. ఇలా డిస్టిలరీలను పోగొట్టుకున్నవారిలో టీడీపీ నేతలే అధికంగా ఉన్నారు. వారందర్నీ బెదిరించి తమ పని కానిచ్చేశారు.
వైసీపీ పంచిన మద్యం అంతా లోకల్ తయారీ
ఎన్నికల్లో వైసీపీ విచ్చలవిడిగా మద్యం పంచింది. ప్రతి నియోజకవర్గానికి ఒకే బ్రాండ్ సరఫరా అయింది. ఇదంతా ఎవరు చేశారు అంటే.. వైసీపీ నేతలే. అంతా ప్రణాళికాబద్దంగా పన్నులు కట్టకుండా లోకల్ గా తయారు చేసి లోకల్ గా పంచేశారు. పెద్దమొత్తంలో దొరికిన మద్యం అంతా గోవా బ్రాండ్లు అని చెప్పుకున్నారు. కానీ అదంతా లోకల్ తయారీనే.
అసలు నిందితులు మిథున్ రెడ్డి. వి.సా.రెడ్డి
ఈ డిస్టిలరీలన్నీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి గుప్పిట్లో ఉండేవి. అదాన్ డిస్టిలరీస్ పేరుతో ఉన్న కంపెనీకి వేల కోట్ల ఆర్డర్లు వెళ్లాయి. ఆ కంపెనీ వి.సా.రెడ్డి అల్లుడి బినామీ కంపెనీ. ఇక మిథున్ రెడ్డి అయితే మద్యం పేరుతో దోచినదంతా చిన్న మొత్తం కాదు. పది వరకూ డిస్టిలరీలను గుప్పిట్లో పెట్టుకున్నారు. ఈ స్కాంలో ఈడీ కూడా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.