నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్…
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం – 2024 సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారభించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్ .
ప్రముఖ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి మరియు ఇతర వైద్యుల సహకారంతో రెడ్ క్రాస్ సొసైటీ సంస్థ వారు ఈ రక్తదాన శిబిరాన్ని చేపట్టినారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం – 2024 సందర్భంగా ప్రజా రక్షణ కొరకు వారు చేసిన త్యాగాలకు గుర్తుగా ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం ఎంతో గొప్పవిషయం.ఈ కార్యక్రమాన్ని ప్రారభించడం చాలా సంతోషంగా ఉందని ఎస్పీ తెలిపారు.
రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేయడంతో సమానం కావున ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడటానికి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు.
ప్రజా రక్షణకై అసాంఘిక శక్తులు అణచివేతలో ఎందరో పోలీసులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి అమరులైనారు.
ఆ పోలీస్ అమరవీరుల నాటి త్యాగాల ఫలితమే నేడు మనం సంతోషంగా ఉంటున్నాము.
ఆ పోలీస్ అమరవీరులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఈ రోజు ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అనేది మనం వారికి ఇస్తున్న నివాళి అని ఎస్పీ తెలిపారు.
ప్రజల ధన,మానాలతో పాటు వారి ప్రాణాలను కాపాడటానికి పోలీస్ వారు ఎల్లవేళలా ముందువరుసలో ఉంటారని చెప్పడానికి ఈ పోలీస్ రక్తదాన శిబిరం ఒక ఉదాహరణ అని ఎస్పీ తెలిపారు.
ఈ రోజు రక్తదానం చేసిన పోలీస్ వారికి,యువతకు అభినందనలు. ఇంకా యువత, ప్రజలు కూడా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఎస్పీ సూచించారు.
ఈ సందర్భంగా ప్రముఖ అంతర్జాతీయ బ్యాంక్ HDFC వారి సౌజన్యంతో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలోనీ మొబైల్ బ్లడ్ బ్యాంక్ వాహనాన్ని ఎస్పీ పరిశీలించినారు.
సమాజ హితం కోసం HDFC Bank వారు అందిస్తున్న తోడ్పాటు ఎంతో ప్రశంసనీయం అని,వారికి హృదయపూర్వక అభినందనలు అని తెలిపారు.
పల్నాడు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రక్తదానం చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.రక్తదానం చేయడం వలన ఆరోగ్య సమస్యలు వస్తాయి అనే మాట అవాస్తవం. కావున ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ రక్తదాన శిబిరానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసిన ఏఆర్ డి యస్ పి జి.మహాత్మా గాంధీ వెల్ఫేర్ ఆర్ఐ యల్.గోపినాథ్ ,ANS RI యువరాజ్ ని,MT RI కృష్ణ ,అడ్మిన్ RI యం.రాజా ని ఎస్పీ అభినందించారు.
ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడంలో సహకారం అందించిన డాక్టర్. కంజుల జగన్ మోహన్ రెడ్డి చైర్మన్ రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు జిల్లా,.
పి వి యం శరత్ బాబు వైస్ చైర్మన్,బత్తుల మురళీ మేనేజింగ్ కమిటీ సభ్యులను ఎస్పీ అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ,అదనపు ఎస్పీ జె.వి సంతోష్ డాక్టర్లు,పోలీసు అధికారులు మరియ సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.