నారద వర్తమాన సమాచారం
అనుమతి లేకుండా బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం:అర్బన్ సీఐ పి రమేష్
చిలకలూరిపేట:
దీపావళి పండుగను పట్టణ ప్రజలు ఆనంద ఉత్సవాల మధ్య సుఖ సంతోషాలతో తగు భద్రత చర్యలు పాటిస్తూ పర్యావరణానికి హాని కలగకుండా జరుపుకోవాలని అర్బన్ సీఐ పి రమేష్ ఆకాంక్షించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శబ్ద కాలుష్యం సృష్టించే బాణాసంచాకు ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వపరమైన అనుమతులు లేకుండా ఏ ఒక్కరు పట్టణంలో బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేయరాదని ,అలా చేస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అనుమతులు పొందిన దుకాణదారులు ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని, దుకాణాల వద్ద తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. పట్టణంలో తోపుడుబండ్ల మీద అనుమతులు లేకుండా బాణాసంచా విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని మరోసారి హెచ్చరించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.