నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయం,
నరసరావుపేట
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, ఐపీఎస్
ఈ స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక, ఆస్తి తగాదాలు మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 77 ఫిర్యాదులు అందాయి.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు.
క్రోసూరు గ్రామానికి చెందిన కేదారి చంద్రశేఖర్ యొక్క పూర్వీకులు ఉమ్మడిగా వచ్చిన ఆస్తిలో వారి భాగమును అనగా వారి యొక్క ఇల్లును సాయిబాబా గుడి కమిటీకి చెందిన ప్రతాపరెడ్డి, శ్రీనివాసరెడ్డి, కోటిరెడ్డి, వెంకట్రావు అనువారులు కొని, వారు కొన్న స్థలమునకు ఆనుకొని ఉన్న ఫిర్యాదు యొక్క ఇల్లును ఆక్రమించాలనే ఉద్దేశంతో గొడవలు పెట్టుకుని, ఫిర్యాదిని ఫిర్యాది భార్యను, అతని కొడుకును బెదిరిస్తూ, బూతులు తిడుతూ అమ్మిన దానికంటే ఎక్కువ స్థలమును ఆక్రమించాలని చూస్తున్నట్లు దాని పై చర్య తీసుకొన వలసిందిగా ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
నరసరావుపేట పట్టణానికి చెందిన చోడవరపు ప్రత్యూష కు 2022వ సంవత్సరంలో హైదరాబాదుకు చెందిన చోడవరపు సాయి సంతోష్ చైతన్యతో వివాహమైనట్లు, వివాహం సమయంలో 17 లక్షల రూపాయలు నగదు, 250 గ్రాముల బంగారం, రెండు కిలోల వెండి సామాగ్రి ఇచ్చినట్లు, ఇంటి సామాన్లకు గాను 2,50,000/- ఫిర్యాదు తల్లిదండ్రులు అత్తమామలకు ఇచ్చినట్లు, బెంగుళూరు నందు కాపురం పెట్టిన తర్వాత ఫిర్యాదిని తన భర్త, అత్తమామలు అందరూ కలిసి అధిక కట్నం గురించి శారీరకంగా మానసికంగా హింసించుచున్నారని ఫిర్యాదు ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
పిడుగురాళ్ల మండలం పాటి గుంతల గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ వలి పిడుగురాళ్ల పట్టణంలోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ నందు హౌసింగ్ లోన్ 6,30,000/- తీసుకోనగా నెలకు 1820 రూపాయలు కట్టు లాగా ప్రతి నెల కట్టుచుండగా ఫిర్యాది ఒక నెల వ్యాపారం సాగక అక్టోబర్ నెలలో కట్టవలసి ఉన్న కిస్తీ కట్టలేదు. అందుకు లోన్ కట్టించుకునే ఏజెంట్ అయిన కంపా శ్రీను వచ్చి ఇంట్లో అందరితో అమర్యాదగా ప్రవర్తించి ఇంటికి తాళం వేస్తాను అంటూ దౌర్జన్యంగా మాట్లాడి కొంచెం గడువు ఇప్పిస్తే కడతాను అన్న కూడా వినకుండా ఇబ్బందులు పెడుతున్నాడని ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
రాగిపిండి కోటేశ్వరి భర్త అయిన చిన వెంకట రామిరెడ్డి ఆన్లైన్ లో జూదం ఆడుతూ అప్పులు చేస్తూ ఫిర్యాదిని హింసిస్తున్నాడు. తన గురించి ఎవరికైనా చెబితే ఆత్మహత్య చేసుకుంటానని కోటేశ్వరిని బెదిరిస్తూ పుట్టింటి వారు పెట్టిన ఆస్తిని అమ్మి ఇవ్వాలని కోటీశ్వరుని పుట్టింటి వద్ద వదిలివేసి అతను తీసుకురమ్మని లేదంటే కాపురం చేయనని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇబ్బంది పెడుతున్నందుకు గాను న్యాయం చేయవలసిందిగా ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
నరసరావుపేట మండలం లింగంగుంట్ల గ్రామానికి చెందిన మండాది జ్యోతి భర్త అయిన తిన్నాను ఆమె పెద్ద మామ కుమారులు అయినా మండాది ప్రభుదాస్ అనే అతను ఇబ్బందులకు గురిచేయుచున్నాడని అందువలన మండాది జ్యోతి భర్త అయిన చిన్న ఇంటికి కూడా రాకుండా భయపడుతున్నాడని మండాది జ్యోతిని కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కావున ఈ విషయమై ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
నరసరావుపేట మండలం మొలకలూరు కి చెందిన చింతిరాల బాజమ్మ నరసరావుపేట పట్టణంలోని ఫైవ్ స్టార్ ఫైనాన్స్ నందు హౌసింగ్ లోన్ 3,50,000 తీసుకోగా సదరు ఫైనాన్స్ వారు 40 వేల రూపాయలు తగ్గించి ఇచ్చినట్లు లోన్ మొత్తం 3,50,000/- రూపాయలు చెల్లించగా సదరు ఫైనాన్స్ వారు ఇంకా డబ్బులు కట్టాలని ఒత్తిడి చేస్తూ ఫిర్యాదుకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకున్నారని ఎస్పీ ని కలిసి న్యాయం చేయవలసింది గా అర్జీ ఇవ్వడమైనది.
గురజాల పట్టణానికి చెందిన కన్నె కంటి జ్యోతి కుమారుడు తన ఫ్రెండ్స్ వద్ద డబ్బులు తీసుకున్నట్లు ఆ డబ్బుల విషయమై తన కుమారుడు నాలుగు రోజుల నుండి కనబడకుండా పోయినట్లు,కావున తన కుమారుడి స్నేహితులు కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానం పై తనకు న్యాయం చేయవలసింది గా ఫిర్యాది ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వారి ఫిర్యాదులను రాసిపెట్టడంలో పోలీస్ సిబ్బంది సహాయ సహకారాలు అందించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.