నారద వర్తమాన సమాచారం
కూటమి ప్రభుత్వం కలకాలం ఉండాలన్నదే చంద్రబాబు సంకల్పం: ప్రత్తిపాటి
నరసరావుపేటలో కూటమి నాయకుల సమావేశంలో పాల్గొన్న ప్రత్తిపాటి
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కలకాలం నిలిచి ఉండాలన్నదే సీఎం చంద్రబాబు సంకల్పమని, అందుకు అనుగుణంగానే ఆయన ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. పార్టీలో, ప్రభుత్వంలో పనులు కావాలి అనుకునే వారు ఈ విషయం, ముఖ్యమంత్రి ఆలోచనలు దృష్టి పెట్టుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బుధవారం నరసరావుపేటలోని కోమల రెసిడెన్షీలో జరిగిన పల్నాడు జిల్లా కూటమి నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఇన్‌ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి గొట్టిపాటి రవికుమార్ రూపంలో జిల్లా సమస్యల పరిష్కారం, అభివృద్ధి, సంక్షేమంలో అన్నిటి పట్ల అవగాహన ఉన్న నాయకుడు పల్నాడు జిల్లాకు ఇన్‌ఛార్జి మంత్రిగా రావడం ఇక్కడి ప్రజల అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఆయన అందరినీ కలుపుకుని సమన్వయంతో అభివృద్ధిలో 25 జిల్లాల్లో పోటీపడి ముందుకు తీసుకెళ్లే ఆలోచనాపరుడని ప్రశంసించారు. ఏ గ్రామానికి వెళ్లినా 5 నుంచి 10 మంది నాయకులు ఉన్నారని, అందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత తమపైనే ఉందన్నారు. నిధులు తీసుకుని రావడం, నియోజకవర్గాలను సంతృప్తిపరిచ డం, పదవుల పంపకాలు అన్నీ త్వరలోనే పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారన్నారు. అయితే ఐదేళ్లు అధికారంలో ఉంటున్నామనే విషయం మరిచిపోయి రాత్రికి రాత్రే పనులు కావాలనే ఆత్రుత తగదన్నారు. కూటమిలో తెలుగుదేశం ఒక్కటే నిర్ణయం తీసుకునేది కాదని, 3 పార్టీలు సమన్వయం చేసుకోవాలన్నారు. అందుకే ఆచితూచి ముందుకెళ్లాలని సీఎం చంద్రబాబు ఆలోచనలో ఉన్నారని, ఎవరూ కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. రాత్రికి రాత్రి తమ పనులు చేయలేదనో, ఇంకొకటో మనసులో పెట్టుకోవదని సూచించారు. ఈ కూటమి ప్రభుత్వం దీర్ఘకాలికంగా ఉండాలనే ఆలోచనలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ ఉన్నారని, ఈ విషయం అందరూ గుర్తుంచుకోవాలన్నారు. అందరినీ సంతృప్తి పరిచే బాధ్యతను చంద్రబాబు తన భుజస్కంధాలపై వేసుకున్నారన్నారు. సీఎం చంద్రబాబు ఇప్పటికే చెప్పినట్లు ఇది రాజకీయ ప్రభుత్వమని చాలా స్పష్టంగా చెబుతున్నారని, అది అంతా గమనించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలానే పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు ఖాయమైందని, అర్హులైన పట్టభద్రులను ఓటరుగా చేర్పిండమే తమ ముందున్న కర్తవ్యమని చెప్పారు. నియోజకవర్గానికి 10 వేల నుంచి 15 వేల వరకు పట్టభద్రుల ఓటర్ల జాబితాలు ఉన్నాయన్నారు. ప్రతి 4 ఓట్లకు ఒక తెదేపా సభ్యత్వం ఉండాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని తెలిపారు. దేశంలో ఏ పార్టీకి లేనటువంటింది రూ.5 లక్షల ప్రమాద బీమా ఇస్తున్నారని, సాధారణ మరణానికి రూ.5 లక్షల బీమా వచ్చేలా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఎన్నికల నియమావళిని అనుసరించి పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుపుతున్నారన్నారు. పదవుల కోసం ఎప్పుడూ లేనివిధంగా పోటీతత్వం ఉందని, 23,500 మంది దరఖాస్తు చేసుకున్నారని, అందుకనే పార్టీ ఆచితూచి నిర్ణయం తీసుకుంటుందన్నారు. పదవుల పంపకం కూడా చాలా కష్టతరంగా మారిందని, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, జనసేన అధినేత పవన్, బీజేపీ నాయకులకు కూడా కష్టతంరగా మారిందన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.