నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా…
కార్తీక మాసం స్నానం ఆచరించే భక్తులు నదీ తీర ప్రాంతాల దగ్గర అప్రమత్తంగా ఉండాలి …
జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపియస్
భక్తులు ఒంటరిగా వెళ్ళకూడదు.
దొంగల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలి.
రేపటి (నంబర్ 2 నుంచి డిసెంబర్ 01 , 2024 వరకు) నుండి కార్తీక మాసోత్సవాలు.
కార్తీక మాసం పురస్కరించుకొని తెల్లవారుజాము నుండే పొగమంచు లో శైవ ఆలయాలకు, నదీ తీర ప్రాంతాలు, అతి వేగంగా ప్రవహించే కాలువలు, వంకలు లోతుగా ఉన్న చెరువులలో కార్తీక పుణ్య స్నానాలు ఆచరించడానికి వెళ్ళే భక్తులు తమ వెంట చిన్న పిల్లలు, వృద్దులు, మహిళలను తీసుకొని వెళ్లినట్లయితే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కంచి.శ్రీనివాస రావు ఐపియస్ శుక్రవారం ఒక ప్రకటనలో పలు సూచనలు, జాగ్రత్తలు తెలియజేశారు.
పెద్ద సంఖ్యలో భక్తులు రెంటచింతల మండలం సత్రశాల,గురజాల మండలం దైద,అమరావతి నదీ తీర ప్రాంతాల దగ్గర భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.
అమరావతి పుష్కర ఘాట్లో కార్తీక దీపోత్సవ వేడుకలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాము.
ముఖ్యంగా మహిళలు నీటిలో దీపాలు వదిలివేస్తారు. కృష్ణ కెనాల్ వద్ద మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.
నదీ తీర ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముఖ్యమైన ప్రాంతాలలో పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నాము.
స్నానాలు ఆచరించడానికి వచ్చే ప్రజలు పోలీసుల సూచనలు పాటిస్తూ నదీ స్నానాలు ఆచరించి క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేరుకోవాలని జిల్లా ఎస్పీ గారు ప్రజలకు సూచించారు.
పోలీసు వారు సూచించే నిబంధనలు భక్తుల రక్షణ, భద్రత కొరకేనని, ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలన్నారు.
పుణ్య స్థానాలు ఆచరించడానికి వచ్చే భక్తులు వారి కుటుంబ సభ్యులతో నది తీర ప్రాంతాలలో ఆనందంగా గడపాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు.
జిల్లా పోలీసు కార్యాలయం , పల్నాడు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.