Friday, December 27, 2024

అమెరికా ఎన్నికలకు సర్వం సిద్ధమైంది

నారద వర్తమాన సమాచారం

వాషింగ్టన్: అమెరికా ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. భా రత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ఓ టింగ్ ప్రక్రియ మొదలు కానుంది. 27 కోట్ల మంది అగ్రరాజ్యం ఓటర్లు తమ హక్కును వినియోగించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.

వీరిలో ఇప్పటికే 7కోట్లకుపైగా మంది ఎర్లీ ఓటింగ్‌లో భాగంగా తమ ఓటు హక్కును వి విధ మార్గాల ద్వారా వినియోగించుకున్నారు. అధ్యక్ష పదవి కోసం ప్రధానంగా రిపబ్లికన్ల తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ల నుంచి కమలా హారిస్ బరిలో ఉన్నారు. అమెరికాలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సమయానికి పోలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఆయా రా ష్ట్రాల్లో ఉదయం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ సాగుతుంది. మరికొన్ని రాష్ట్రాల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్ సాగే అవకాశాలున్నాయి. అయితే అమెరికా ఎన్నికల ఫలితాన్ని తేల్చే వాటిలో స్వింగ్ స్టేట్స్ గా పిలుచుకుంటున్న ఏడు రాష్ట్రాలు కీలక పాత్ర పోషించనున్నాయి.

అమెరికాలోని 50 రాష్ట్రాల్లో చాలావరకు రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల్లో ఏదో ఒకదానికి స్పష్టంగా మద్దతిచ్చేవే కావడంతో వాటిని సేఫ్ స్టేట్స్‌గా పిలుస్తారు. ప్రతి అధ్యక్ష ఎన్నికల్లోనూ సదరు రాష్ట్రాలను ఆయా పార్టీ లే గెలుచుకుంటాయి. ఎటూ తేల్చుకోని ఓటర్లు ఎక్కువ గా ఉండే కొన్ని రాష్ట్రాలను స్వింగ్ స్టేట్స్‌గా పేర్కొంటారు. పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, మిషిగన్, నార్త్ కరోలినా, జార్జియా, నెవడా, అరిజోనా ఈ ఏడు స్వింగ్ స్టేట్స్‌లలో 93 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. వీటిలో మెజారిటీ ఓట్లను సాధించినవారే అమెరికా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకుంటారు. మొత్తానికి 270 ఎలక్టోరల్ ఓట్లు సాధించిన వారికే అధ్యక్ష పీఠం వశమవుతుంది. జనవరి 6న కాం గ్రెస్ సమావేశమై ఎలక్టోరల్ ఓట్లను ధృవీకరించి విజేతను ప్రకటిస్తుంది. జనవరి 20న నూతన అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం, అధికా బదిలీ ప్రక్రియ సాగుతుంది.

సర్వేల కలకలం…
పోలింగ్‌కు కొన్ని గంటల ముందు అట్లాస్ ఇంటెల్ తా జా పోల్ సర్వేను ప్రకటించడం చర్చనీయాంశమైంది. స్వింగ్ స్టేట్స్‌లో డొనాల్డ్ ట్రంప్ పుంజుకున్నట్లు ఆ సర్వే వెల్లడించింది. కమలా హారిస్‌తో పోల్చితే ట్రంప్‌కు 1.8 శాతం మంది అధికంగా మద్దతు పలుకుతున్నట్లు వెల్లడించింది. నవంబర్ నెలలో తొలి వారంలోనే ఈ సర్వే ని ర్వహించినట్లు అట్లాస్ వివరించింది. అరిజోనా, నెవడా, నార్త్ కరోలినా రాష్ట్రాల్లో ట్రంప్ స్పష్టమైన ఆధిక్యాన్ని చాటబోతున్నట్లు తెలిపింది. మరోవైపు కీలకమైన అయో వా రాష్ట్రంలో హారిస్‌దే పైచేయి అని, 47శాతం మంది ట్రంప్‌తో పోల్చితే ఆమెకు 3శాతం అధికంగా మద్దతు లభిస్తోందని ఓ సర్వేలో వెల్లడైంది. అయితే దీనిపై ట్రంప్ మండిపడ్డారు. అది ఫేక్ సర్వే అని, ‘ఐయామ్ నాట్ డౌ న్’ అని స్పష్టం చేశారు. అయితే సెప్టెంబర్ నెలలో నిర్వహించిన అదే సర్వేలో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నట్లు తెలపడం విశేషం. ఇక్కడ 2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఆధిపత్యాన్ని చాటారు.

న్యూయార్క్‌లో బెంగాలీలోనూ బ్యాలెట్
ఓటర్లకు సౌలభ్యంగా ఉండేందుకు ఆయా రాష్ట్రాలు వివిధ భాషల్లో బ్యాలెట్‌లను అందుబాటులో ఉంచుతున్నాయి. ఈ క్రమంలో న్యూయార్క్ రాష్ట్రం ఇంగ్లీష్‌కు అ దనంగా మరో ఐదు భాషల్లో వీటిని ముద్రించగా, అం దులో భారతీయ భాష ‘బెంగాలీ’ ఉండటం విశేషం. ” ఎన్నికల ప్రక్రియలో ఇంగ్లీష్ కాకుండా మరో నాలుగు భాషలకు చోటు కల్పించాం. చైనీస్, స్పానిష్, కొరియన్, బెంగాలీ భాషల్లో బ్యాలెట్ అందుబాటులో ఉంది ” అని న్యూయార్క్ రాష్ట్ర ఎన్నికల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ జే రియాన్ పేర్కొన్నారు.ఇక్కడ స్థిర పడిన వారికి ఇంగ్లీష్ తెలిసినప్పటికీ, మాతృభాషలో అందుబాటులోఉండటం ఆయా ప్రాంతాల వారికి సంతోషకర అంశమన్నారు. అ యితే భారత్‌లో అనేక భాషలున్నప్పటికీ గతంలో కోర్టు లో వేసిన ఓ దావా వల్ల ఎన్నికల ప్రక్రియలో బెంగాలీకి చోటు లభించింది. ఎన్నికల నిర్వహణలో అనేక దేశాలు ఏకీకృత వ్యవస్థను అనుసరిస్తున్నప్పటికీ, అమెరికా మా త్రం ఇందుకు భిన్నం. ప్రచార చట్టాలను ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షిస్తుండగా, ఎన్నికల ప్రక్రియను మాత్రం ఆయా రాష్ట్రాలు ప్రత్యేక నిబంధనలను పాటిస్తాయి.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading